చిత్రం : పడమటి సంధ్యా రాగం (1987)
సంగీతం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
రచన : వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
పల్లవి:
మె: ఈ తూరుపు... ఆ పశ్చిమం... సంగమించిన ఈ శుభవేళ... పడమటిసంధ్యారాగాలెవో... పారాణి పూసెనులే... డు: you aavakai me ice cream this is the hot and sweet love's dream united states of hearts we have.. like Indian namsthey... చరణం: 1
మె: ఆకసంలో తార.. సుడిగాలికారని దీపం.. గుడిలేని దైవం కోసం ఒడి చేరుకున్నదిలే... సాగరంలో కెరటం.. ఉప్పొంగిన నా హృదయం .. అలిసేది కాదనురాగం... ఈ జన్మ సంగీతం... గ్రహణాలు లేని ఆ తారలన్ని గగనాన కలిసి ఈ వేళలోనే కలిసింది ఈ బంధం.. కలిసింది ఈ బంధం... ఈ తూరుపు... ఆ పశ్చిమం... సంగమించిన ఈ శుభవేళ... పడమటిసంధ్యారాగాలెవో... పారాణి పూసెనులే... డు: Ladies and Gentlemen... this is your captain speaking from the cockpit.. It's unfortunate.. we caught fire on all the engines.. i advise you to put on your parachutes and bail out immediately... చరణం: 2
మె: చైత్ర కోయిలలెన్నో.. మైత్రి వేణువులూదే.. మనసైన మాటల కోసం.. మౌనాల ఆశలు పూసే... ఏడేడు రంగుల దీపం.. ఆ నింగిలో హరిచాపం... అరుణాల రుధిరంతోనే ఋణమైనదీ ప్రియబంధం ఏ దేశమైనా ఆకాశమొకటే.. ఏ జంటకైనా అనురాగమొకటే అపురూపమీప్రణయం.. అపురూపమీప్రణయం.. మె: ఈ తూరుపు... ఆ పశ్చిమం... సంగమించిన ఈ శుభవేళ... పడమటి సంధ్యా రాగాలెవో... పారాణి పూసెనులే... డు: you aavakai me ice cream this is the hot and sweet love's dream ... whistle ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి