2, ఏప్రిల్ 2022, శనివారం

Ramudu Bheemudu : Telisindi Le Telisindi Le Song lyrics (తెలిసిందిలే తెలిసిందిలే )

చిత్రం: రాముడు-భీముడు (1964)

రచన: సి. నారాయణ రెడ్డి

గానం: ఘంటసాల,సుశీల

సంగీతం: పెండ్యాల




తెలిసిందిలే తెలిసిందిలే - నెలరాజ నీ రూపు తెలిసిందిలే తెలిసిందిలే తెలిసిందిలే - నెలరాజ నీ రూపు తెలిసిందిలే చలిగాలిరమ్మంటు పిలిచిందిలే చెలి చూపు నీ పైన నిలిచిందిలే చలిగాలిరమ్మంటు పిలిచిందిలే చెలి చూపు నీ పైన నిలిచిందిలే ఏముందిలే ఇపుడేముందిలే ……. ఏముందిలే ఇపుడేముందిలే …… మురిపించు కాలమ్ము ముందుందిలే నీ ముందుందిలే వరహల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా ఆ...ఆఆఆఆఆఆ వరహల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా అవునందునా కాదందునా ……. అవునందునా కాదందునా ……. అయ్యారే విధి లీల అనుకొందునా అనుకొందునా సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది కనులేమిటో ఈ కథ లేమిటో ……. కనులేమిటో ఈ కథ లేమిటో …… శ్రుతిమించి రాగన పడనున్నది పడుతున్నది

తెలిసిందిలే తెలిసిందిలే - నెలరాజ నీ రూపు తెలిసిందిలే తెలిసిందిలే తెలిసిందిలే - నెలరాజ నీ రూపు తెలిసిందిలే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి