2, ఏప్రిల్ 2022, శనివారం

Thikka Shankaryya : Kovela Erugani Song Lyrics (కోవెల ఎరుగని)

చిత్రం: తిక్క శంకరయ్య (1968)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: ఘంటసాల,సుశీల

సంగీతం: టి. వి. రాజు



కోవెల ఎరుగని దేవుడు కలడని... కోవెల ఎరుగని దేవుడు కలడని... అనుకొంటినా నేను ఏనాడు. కనుగొంటి కనుగొంటి ఈనాడు. పలికే జాబిలి ఇలపై కలదని... పలికే జాబిలి ఇలపై కలదని. అనుకొంటినా నేను ఏనాడు... కనుగొంటి కనుగొంటి ఈనాడు... ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా... కన్నీట తపియించినాను ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా... కన్నీట తపియించినాను నీ రాకతో... నీ మాటతో.నిలువెల్ల పులకించినాను నిలువెల్ల పులకించినాను... కోవెల ఎరుగని దేవుడు కలడని... అనుకొంటినా నేను ఏనాడు ... కనుగొంటి కనుగొంటి ఈనాడు... ఇన్నాళ్ళుగా విరజాజిలా... ఈ కోనలో దాగినావు ఇన్నాళ్ళుగా విరజాజిలా... ఈ కోనలో దాగినావు ఈ వేళలో... నీవేలనో... నాలోన విరబూసినావు నాలోన విరబూసినావు... పలికే జాబిలి. ఇలపై కలదని... అనుకొంటినా నేను ఏనాడు... కనుగొంటి కనుగొంటి ఈనాడు... కోవెల ఎరుగని దేవుడు కలడని... అనుకొంటినా నేను ఏనాడు. కనుగొంటి కనుగొంటి ఈనాడు. ఆహ... హ... ఆహా... హా... ఊ... ఊ.ఉం...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి