11, ఏప్రిల్ 2022, సోమవారం

Seema Sastri : Intha Andhamaina Song Lyrics (ఇంత అందమైన అమ్మాయిని)

చిత్రం: సీమ శాస్త్రి (2007)

సాహిత్యం:

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

గానం: కార్తీక్

 


ప్రియతమా ప్రియతమా.... ఇంత అందమైన అమ్మాయిని ఇంత అందమైన అమ్మాయిని ఇంత అందమైన అమ్మాయిని దేవుడా ఎట్ట తలచినావో మలచినావో దేవుడా ఇంత అందమైన అమ్మాయిని దేవుడా నేను ఇంత కాలం చూడలేదు దేవుడా ఐస్కాంతమేదో తన చూపుల్లో దాగుంది తన వైపే లాగేస్తూ వుందే.. నా మనసే ఆగదు యే భాషైన చాలదు తన రూపం వర్ణిస్తూ వుంటే హరివిల్లును బొమ్మగ చేసి అనువనువు వెన్నెల పోసి నాకోసం పుట్టించావేమో ఓ ఓఓ ఓఓ ఓఓ..... ఇంత అందమైన అమ్మాయిని దేవుడా ఎట్ట తలచినావో మలచినావో దేవుడా తను సన్నగా నవ్వితే ముత్యాల వాన ఆ వానలో తడవాలేమైన.. నడుమంపుల్లో వున్నది వయ్యార వీన ఆ వీణలో రాగాన్నైపోన.... అమ్మాయి ఊరేంటో తన ముద్దు పేరేంటో తన ఇష్టాలేంటేంటో చెలినే తలచి పనులే విడిచి రేయి పగలు తన ఊహలతో ఇదివరకెరగని అలజడి మెదలై తడవ తడవకి తడబడి పొరబడి కలవర పడుతూ కళలే కంటూ కునుకే రాదు కుదురే లేదు ప్రియతమా... ప్రియతమా ఓ ప్రియతమా... ప్రియతమా... ఇంతింత అందమైన అమ్మాయిని దేవుడా.. ఎట్టెట్ట తలచినావో మలచినావో దేవుడా దేవుడా....... తను అడిగితే ఇవ్వన నా ప్రాణమైన నా సర్వము తనదే అంటున్న కనుపాపని కాపాడే కనురెప్పలాగ చెలి తోడుగా నూరేళ్లుంటాగ ఆ దేవుడు వరమిచ్చి తన మనసే నాకిస్తే నాకింకేం కావాలీ ఎప్పుడూ లేదే ఎదలో గుబులు నిను చూసాక సెగలే మొదలు కదలదు సమయం క్షణమొక యుగమై కనులు తెరవగ ఎదురుగ నిలబడి చేతులు చాచి రమ్మని పిలచి అందీ అందక ఊరిస్తావే ప్రియతమా..... ప్రియతమా.... ఓఓ....... ప్రియతమా..... ప్రియతమా.... ఇంత అందమైన అమ్మాయిని దేవుడా ఎట్ట తలచినావో మలచినావో దేవుడా ఇంత అందమైన అమ్మాయిని దేవుడా నేను ఇంత కాలం చూడలేదు దేవుడా.. దేవుడా..... దేవుడా......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి