చిత్రం: శీను (1999)
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్, సుజాత
సంగీతం: మణి శర్మ
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే ఇదివరకు తెలియంది ఈ అనుభవం ఎద మేలుకొలిపింది ఈ పరిచయం ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ… ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే నీ కళ్ళ వాకిళ్లలో తలుపు తెరిచెను ప్రేమ...ప్రేమ మోహాల ముంగిళ్లలో వలపు కురిసెను ప్రేమ...ప్రేమ ఈనాడే తెలిసింది తొలిసారిగా యెంత తీయంది ప్రేమని ఆకాశ దీపాలు ఇల చేరగా తెర తీసింది ఆమని ఇది సంగీతమో తొలి సంకేతమో ఇది ప్రియగీతమో మధు జలపాతమో… ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే ఏనాడు ఏ దేవతో మనను కలిపిన వేళ...వేళ ఈనాడు ఈ దేవితో మనసు తెలిపెను చాల..చాల కాలాలు ఓకసారి ఆగాలిలే మన తొలిప్రేమ సాక్షిగా లోకాలు మన వెంట సాగాలిలే మన ప్రేమికుల తోడుగా ఇది ఆలాపనో మది ఆరాధనో మన సరసాలకే తొలి సంకీర్తనో…. ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే ఇదివరకు తెలియంది ఈ అనుభవం ఎద మేలుకొలిపింది ఈ పరిచయం ఓ...ఓ...ఓ...ఓ...ఓ...ఓ… ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి