చిత్రం : సూర్యవంశం(2001)
సంగీతం : యస్.ఏ.రాజ్ కుమార్
రచన : షణ్ముఖ శర్మ
గానం : హరిహరన్
లాలలా లాలలా లాలలా లలలలాల లలలలాల రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే ఆకాశం అందాలంటూ దూకే కెరటంలా ప్రేమే నాలో ఆ హోరు నీ పేరునే పలికే మంత్రంలా నా గుండెలో దారంతా చలువ పందిళ్ళే వేసి నీకోసం నీడై ఉన్నా నాలో నేనే లేనే లేను నేను నిన్నే నాలో కొలువుంచాను రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే మేరుపంటి నీ రాకకై మనసే మేఘంలా మారిందిలే చిరుగాలై తలపే తాకి కదిలి నిలువెల్లా కరిగిందిలే తొలి చినుకే తాకే నేలల్లె నేనే పులకించా నీ ఊహతో రానే రావు ఓనమాలు కాని నీలో చదివా ప్రియ వేదాలు రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి