Suryavamsham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Suryavamsham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, మే 2022, మంగళవారం

Suryavamsham : Jhalaku Jhalaku Song Lyrics (ఝలకు ఝలకు )

చిత్రం : సూర్యవంశం(2001)

సంగీతం : యస్.ఏ.రాజ్ కుమార్ 

రచన : భువనచంద్ర

గానం : గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత



ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు ఛమకు ఛమకు జిలుగు రైక ఛమకు ఛమకు రా రమ్మన్నది పిల్లా ఒళ్ళో చేరుకో వెచ్చని కౌగిట వెన్నలాగ కరిగిపో కసిగా కవ్విస్తుంది నడుము నీ నడుము ఉసిగా పట్టాలంటే టైము ఇది టైము ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు ఛమకు ఛమకు జిలుగు రైక ఛమకు ఛమకు అరె నీ బుగ్గల్లోన ఏమున్నదో బాదం హల్వా ముక్క దాగున్నదో అరె నీ చూపుల్లోన ఏమున్నదో పైటని తప్పించేసే పవరున్నదో గుస గుసలాడేయ్ మంది సన్న రైక సొగసుగా పట్టె మంచం బెదురుకుంటే చాప, దిండు ఉందిగా వాళుతున్నవి కళ్ళు, అరె ఊగుతున్నది ఒళ్ళు పైన వెన్నెల జల్లు అరె లోన పుట్టెను జిల్లు కసిగా కవ్విస్తుంది నడుము నీ నడుము ఉసిగా పట్టాలంటే టైము ఇది టైము ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు ఛమకు ఛమకు జిలుగు రైక ఛమకు ఛమకు చల్లగాలి వీస్తుంటే చలి కాచుకో నన్నే దుప్పటిగా పెనవేసుకో ఒడిలో నువ్వుంటే చలి ఏవిటే జతగా ఒకటైతే మతిపోదటే మల్లెపూలు నలిగాయంటే మూడో నెల్లో వేడుకే సత్తావున్న మగాడిచ్చే ముచ్చటైన కానుకే వేడెక్కిపోతుంది పరుపు దాన్ని ఓడించ మంటుంది వలపు కానివ్వు అందాల కొలువు నేడు కన్నెతనానికి సెలవు కసిగా కవ్విస్తుంది నడుము నీ నడుము ఉసిగా పట్టాలంటే టైము ఇది టైము ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు ఛమకు ఛమకు జిలుగు రైక ఛమకు ఛమకు రా రమ్మన్నది పిల్లా ఒళ్ళో చేరుకో వెచ్చని కౌగిట వెన్నలాగ కరిగిపో కసిగా కవ్విస్తుంది నడుము నీ నడుము ఉసిగా పట్టాలంటే టైము ఇది టైము ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు ఛమకు ఛమకు జిలుగు రైక ఛమకు ఛమకు

9, ఏప్రిల్ 2022, శనివారం

Suryavamsham : Rojave Chinni Rojave Song Lyrics ( రోజావే చిన్ని రోజావే)

చిత్రం : సూర్యవంశం(2001)

సంగీతం : యస్.ఏ.రాజ్ కుమార్ 

రచన : షణ్ముఖ శర్మ

గానం : హరిహరన్



లాలలా లాలలా లాలలా లలలలాల లలలలాల  రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే ఆకాశం అందాలంటూ దూకే కెరటంలా ప్రేమే నాలో ఆ హోరు నీ పేరునే పలికే మంత్రంలా నా గుండెలో దారంతా చలువ పందిళ్ళే వేసి నీకోసం నీడై ఉన్నా నాలో నేనే లేనే లేను నేను నిన్నే నాలో కొలువుంచాను రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే మేరుపంటి నీ రాకకై మనసే మేఘంలా మారిందిలే చిరుగాలై తలపే తాకి కదిలి నిలువెల్లా కరిగిందిలే తొలి చినుకే తాకే నేలల్లె నేనే పులకించా నీ ఊహతో రానే రావు ఓనమాలు కాని నీలో చదివా ప్రియ వేదాలు రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలే

1, జులై 2021, గురువారం

Suryavamsham : Chukkalanni Muggulai Song Lyrics (చుక్కలన్ని ముగ్గులై)

చిత్రం : సూర్యవంశం(2001)

సంగీతం : యస్.ఏ.రాజ్ కుమార్ 

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : బాలసుబ్రహ్మణ్యం, సుజాత




చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి

కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి

ప్రతి పూట పూల బాటగ సుమస్వాగతాలు పాడగ

స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం

చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి

కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి


నువ్వే తోడుగ ఉండే జీవితం నిటూర్పు జాడేలేని నిత్యనూతనం

నువ్వే నీడగ పంచే స్నేహితం హేమంతం రానే రాని చైత్ర నందనం

ఎండల్లో చిందే చెమట అమృతం పోయగ గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామ

నిందల్లో నిష్టురాలే నిప్పులే కాంతిగా రేపట్లో అదృష్టాన్ని పోల్చుకోమా

నడిరేయి చేరనీయక సుర్యదీపముంది మన దారి చూపుతోంది

చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి

కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి


అన్ని రోజులు సన్నజాజులై అందంగ అల్లుకుందాం చిన్ని మందిరం

నిన్న ఊహలే నేటి ఊయలై గారంగ పెంచుకుందాం స్నేహ బంధనం

రంగేలి సంతోషాల చందనం చల్లుతూ ఈ గాలి అందుకుంది కొత్త జీవితం

ఉంగాల సంగీతాల రాగమే పాడుతు సాగాలి సూర్యవంశ సుప్రభాతం

అంచుదాటు అమృతం పంచుతోంది నిత్యం మన ప్రేమ పారిజతం


చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి

ప్రతి పూట పూల బాటగ సుమస్వాగతాలు పాడగ

స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం

చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి

లాలలాల్ల లల లాలలాల్ల

26, జూన్ 2021, శనివారం

Suryavamsham : Kila Kila Navve Song Lyrics (కిలకిల నవ్వే కోయిల కోసం)

చిత్రం : సూర్యవంశం(2001)

సంగీతం : యస్.ఏ.రాజ్ కుమార్ 

రచన : ఈ.ఎస్.మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి:

కిలకిల నవ్వే కోయిల కోసం

వచ్చింది మధుమాసం

మిలమిల మెరిసే చంద్రుడి కోసం

తెర తీసెను సాయంత్రం

జోలగా లాలించగా నీ నీడ దొరికింది

కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది

యద విల్లును వంచిన వాడే

నీ రాముడు అన్నది మనసే

గుడి తలుపులు తీయక ముందే

వరమిచ్చెను దేవత ఎదురై

నీదే ఆ చెలి

నిజమేనా జాబిలి


కిలకిల నవ్వే కోయిల కోసం

వచ్చింది మధుమాసం


చరణం:1


ఎదురుచూపులో ఇంత తీపని

తెలయలేదు మునుపు

ఎదురు చూడని ఇంత హాయిని

మరిచిపోదు మనసు

ఒదిగివుండి నీ వాకిటిలో

బదులుకోరి నే నిలుచున్నా

దారి తెలియని చీకటిలో

వెలుగు చూసి కాదంటానా

ఊరించే.....ఇది ఏ మాసం

ప్రేమించే.....ప్రతి గుండెను

అందెల సందడి చేసే హేమంతం ఇది

మన సొంతం అయినది


కిలకిల నవ్వే కోయిల కోసం

వచ్చింది మధుమాసం

మిలమిల మెరిసే చంద్రుడి కోసం

తెర తీసెను సాయంత్రం


చరణం:2


మావితోట మగపెళ్ళి వారికి

విడిది అంది చిలక

మనువు ముందరే మంతనాలకి

కదిలే గోరువంక

జాబిలమ్మని జాజులతో

తరలి రమ్మని అందామా

పేద మనసుకి పెళ్ళంటే

అతిథులెవ్వరు రారమ్మా

నీకన్నా....సిరులా మిన్న

ఓ మైనా....మన మనువులు మెచ్చిన

మనసులు పెట్టిన సుముహూర్తం ఇది

వధువై రానా మరి


కిలకిల నవ్వే కోయిల కోసం

వచ్చింది మధుమాసం

మిలమిల మెరిసే చంద్రుడి కోసం

తెర తీసెను సాయంత్రం

జోలగా లాలించగా నీ నీడ దొరికింది

కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది

యద విల్లును వంచిన వాడే

నీ రాముడు అన్నది మనసే

గుడి తలుపులు తీయక ముందే

వరమిచ్చెను దేవత ఎదురై

నీదే ఆ చెలి

నిజమేనా జాబిలి