చిత్రం: భాగ్యరేఖ (1957)
రచన: దేవులపల్లి
గానం: పి. సుశీల
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
నీవుండేదా కొండపై నా స్వామీ నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె ఈ పేదరాలి మనస్సెంతో వేచె శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె ఈ పేదరాలి మనస్సెంతో వేచె నీ పాదసేవ మహాభాగ్యమీవా ఆ పై నీ దయ జూపవా నా స్వామీ నీవుండేదా కొండపై నా స్వామీ నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో
దూరాననైనా కనే భాగ్యముందా నీ రూపు నాలో సదా నిల్పనీవా ఏడుకొండలపై నా ఈడైన స్వామీ నా పైన నీ దయ చూపవా నా స్వామీ నీవుండేదా కొండపై నా స్వామీ నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో ఏ పూల పూజింతునో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి