Bhagyarekha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bhagyarekha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, మే 2022, గురువారం

Bhagyarekha : nuvvundedi aa konda pai oh swamy song lyrics (నీవుండేదా కొండపై నా స్వామీ)

చిత్రం: భాగ్యరేఖ (1957)

రచన: దేవులపల్లి

గానం: పి. సుశీల

సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు


నీవుండేదా కొండపై నా స్వామీ నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో

శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె ఈ పేదరాలి మనస్సెంతో వేచె శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె ఈ పేదరాలి మనస్సెంతో వేచె నీ పాదసేవ మహాభాగ్యమీవా ఆ పై నీ దయ జూపవా నా స్వామీ నీవుండేదా కొండపై నా స్వామీ నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో

దూరాననైనా కనే భాగ్యముందా నీ రూపు నాలో సదా నిల్పనీవా ఏడుకొండలపై నా ఈడైన స్వామీ నా పైన నీ దయ చూపవా నా స్వామీ నీవుండేదా కొండపై నా స్వామీ నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో ఏ పూల పూజింతునో...

Bhagyarekha : nee sigge singarame oh cheli song

చిత్రం: భాగ్యరేఖ (1957)

రచన: దేవులపల్లి

గానం: ఏ.ఎం.రజా

సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు.




నీ సిగ్గే సింగారమే ; నీ సొగసే బంగారమే ; ఓ చెలియా ; నీ సొగసే బంగారమే ; కనులారా గని మెచ్చేనే - ఓ వనలక్ష్మి ; మనసిచ్చి దిగి వచ్చెనే ; || నీ నవ్వు పూలు - అవే మాకు చాలు ; నీ వయ్యారాలు - అవే వేనవేలు ; ఓ పేదరాలా - మరే పూజలేల ; మాపైన నీ దయ చూపవా ఓ నా చెలి ; || మా తోట పూచే వసంతమ్ము నీవే ; మా బాట చూపే ప్రభాతమ్ము నీవే ; మాలోన కొలువైన మహలక్ష్మి నీవే ; మాపైన దయ చూపవా ఓ నా చెలి ; ||