23, మే 2022, సోమవారం

Dasara Bullodu : Chethilo Cheyyesi Song Lyrics (చేతిలో చెయ్యేసి చెప్పు బావా)

చిత్రం: దసరా బుల్లోడు (1971)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల, ,పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్


చేతిలో చెయ్యేసి చెప్పు బావా చేసుకున్న బాసలు చెరిగి పోవని మరచి పోనని చేతిలో చెయ్యేసి చెప్పు బావా చేసుకున్న బాసలు చెరిగి పోవని మరచి పోనని చేతిలో చెయ్యేసి చెప్పు రాధా చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మారిపోవని చేతిలో చెయ్యేసి చెప్పు రాధా చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మారిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు బావా పాడుకున్న పాటలు పాతబడి పోవనీ చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపు రానివ్వనని పాడుకున్న పాటలు పాతబడి పోవనీ చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపు రానివ్వనని పడుచు గుండె బిగువులు సడలి పోనివ్వనని పడుచు గుండె బిగువులు సడలి పోనివ్వనని దుడుకుగ వురికిన పరువానికి ఉడుకు తగ్గిపోదని చేతిలో చెయ్యేసి చెప్పు బావా చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మరిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు రాధా కన్నెగా కన్నకలలు కధలుగా చెప్పాలి మనకధ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి కన్నెగా కన్నకలలు కధలుగా చెప్పాలి మనకధ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి మనజంట జంటలకే కన్నుకుట్టుకావాలి మనజంట జంటలకే కన్నుకుట్టుకావాలి ఇంక ఒంటరిగా వున్న వాళ్ళు జంటలైపొవాలి చేతిలో చెయ్యేసి చెప్పు బావా చేసుకున్న బాసలు చెరిగి పోవని మరచి పోనని చేతిలో చెయ్యేసి చెప్పు రాధా చెప్పుకున్న వూసులు మాసి పోవనీ మారిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు బావా Lyrics: Acharya Atreya, Singer: Gantasala, P Susheela, Music: KV Mahadevan

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి