చిత్రం: జయం (2002)
సాహిత్యం: కుల శేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
పల్లవి: అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో చరణం 1: అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో ఒక్క మాట అయినా తక్కువేమి కాదే ప్రేమకు సాటేదీ లేదే రైలు బండి కూతే సన్నాయి పాట కాగా రెండు మనసులొకటయ్యేనా కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళ కాలి మువ్వ గొంతు కలిపెనా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో చరణం 2: ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి ఒడిలో చేరిందా ప్రేమ కంటి చూపుతోనే కొంటె సైగ చేసి కలవర పెడుతోందా ప్రేమ గాలిలాగ వచ్చి ఎద చేరెనేమో ప్రేమ గాలి వాటు కాదే మైనా ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా అందుకోవే ప్రేమ దీవెన అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో మ్మ్..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి