Jayam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jayam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జనవరి 2025, సోమవారం

Jayam : Nesthama Song Lyrics (నేస్తమా.. నేస్తమా.. )

చిత్రం: జయం (2002)

సాహిత్యం: కుల శేఖర్

గానం: ఆర్.పి.పట్నాయక్

సంగీతం: ఆర్.పి.పట్నాయక్


పల్లవి: 

నేస్తమా.. నేస్తమా.. 
ఆ గుడి గంటలు మోగితే నువ్వొచ్చావనుకున్నా 
ఏ జడ గంటలు ఊగినా నువ్వేలే అనుకున్నా 
నీ ఊహల్లో రేయి పగలు నే విహరిస్తున్నా 
నీ జ్ఞాపకమే ఊపిరి కాగా ఇంకా బ్రతికున్నా 
ఇంకా బ్రతికున్నా.. 
ఎప్పుడు చూస్తానో నీ నవ్వుల పువ్వులనీ 
ఎప్పుడు వింటానో నీ మువ్వుల సవ్వడిని 

11, జనవరి 2024, గురువారం

Jayam : Sabbasi Song lyrics (బండి బండి రైలు బండి)

చిత్రం: జయం (2002)

సాహిత్యం: కుల శేఖర్

గానం: ఆర్.పి.పట్నాయక్

సంగీతం: ఆర్.పి.పట్నాయక్


పల్లవి:

సబ్బాసే సబ్బాసీ సబ్బాసే బండి బండి రైలు బండి వేళకంటూ రాదు లెండి దీన్ని గానీ నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి బండి బండి రైలు బండి వేళకంటూ రాదు లెండి దీన్ని గానీ నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి దడక దడక దడక దీనీ మయాదారీ నడక ఉలికి ఉలికి పడకే చిలక జరుగు జరుగు మనక ఇది జరగలేదు గనక క్రీస్తు పూర్వం ఇంజన్ గనక

చరణం : 1

రంగులతో హంగులతో పైనా పటారం అబ్బో సూపర్ అని పొంగిపోకోయ్ లోన లొటారం అందరిలో నిందలాలా ఎంత విడ్డూరం అయ్యో రైలంటే మధ్యతరగతి నేల విమానం కూట చూడు జోరుగుందిరో దీని తస్సదీయ అడుగు ముందుకేయకుందిరో ఎంత సేపు డీకుతుందిరో దీని దిమ్మదియ చూడు చూడు నత్త నడకరో ఇది జీవితం లో ఎప్పటికీ టైం కసలు రాదు కాదా

చరణం : 2

డొక్కుదని బొక్కిదని మూల పడేయరు ఇలా ముక్కుతున్న మూల్గుతున్న తిప్పుతుంటారు పాత సామాన్లులోడికైనా అమ్ముకొంటెను తలో పిడికెడునో గుప్పెడునో శనగలోచెను ఎంత పొడవు ఉంది చూడరో దీని బండబడా ఊరి చివర ఇంజిన్ ఉందిరా ఎంత పొగలు కక్కుతుందిరా దీని దుంపతెగా బొగ్గు కొండ మింగినది రో ఎక్కబోయే రైల్ ఎపుడు లైఫ్ టైం లేట్ కదా

Jayam : Ranu Ranu Antune Chinnado Song Lyrics (రాను రానంటూనే సిన్నదో సిన్నదో)

చిత్రం: జయం (2002)

సాహిత్యం: కుల శేఖర్

గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష

సంగీతం: ఆర్.పి.పట్నాయక్




ఏమైందిరా - బాధగా ఉంది నాకు లేని బాధ నీకెందుకురా నీ బాధ నా బాధ కాదా ఎహే రాయే.. హబ్బబ్బబ్బ రాను రాను నాను రాను కుదరదయ్యో కాదు కాదు ఈలు కాదు వొగ్గేయ్ వయ్యో వొద్దు వొద్దు మీద మీద పడకరయ్యో సిగ్గు సిగ్గు సిన్నకోక లాగకయ్యో రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చివంటూనే పిల్లదో పిల్లదో పళ్ళట్టుకొచ్చిందోయ్ పిల్లదో పిల్లది రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది ఏం పండు తీసుకొచ్చిందిరా అబ్బాయ్ యాపిలు పండు నారింజ పండు బత్తాయి పండు బొప్పాయి పండు అనస పండు పనస పండు నిమ్మ పండు దానిమ్మ పండు మామిడి పండు అరటి పండు రాను అని కాదు అని అంతలేసి మాటలని సంతకొచ్చె సూడవయ్యో సిన్నది కాదనంటే ఔనని లే లేదనంటే ఉందనిలే ఆడవారి మాట తీరు వేరులే ఔనా మైనా మాతో చిందేయ్ చిందేయ్ బాబోయ్ రానోయ్ నాకసలే సిగ్గోయ్ సిగ్గోయ్ సిగ్గు సిగ్గంటూనే సిన్నదో సిన్నదో సీరంతా జార్చిందా సిన్నదో సిన్నది కస్సుబుస్సంటూనే కుర్రదో కుర్రదో కౌగిట్లో వాలిందా కుర్రదో కుర్రది హరిలో రంగ హరి హరి స్వామి రంగ హరి హరి ఏంటో ఎవరూ పట్టించుకోట్లేదేంటి గాజువాక పిల్లా మే గాజులోళ్ళం కాదా చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా తప్పు అని గిప్పు అని అందరిలో ముందరని సాటుకొచ్చి సిందులేసె సిన్నది తప్పనంటే ఒప్పనలే ఒప్పనంటే తప్పనలే సూటిగాను సెప్పదయ్యో ఆడది రావే పిల్లా ఎందుకు మల్లాగుల్లా ఎల్లోయ్ ఎల్లోయ్ ఎల్లెల్లోయ్ ఎల్లో ఎల్లోయ్ రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చివంటూనే పిల్లదో పిల్లదో పళ్ళట్టుకొచ్చిందోయ్ పిల్లదో పిల్లది

23, మే 2022, సోమవారం

Jayam : Andamaina Manasulo Song Lyrics (అందమైన మనసులో)

చిత్రం: జయం (2002)

సాహిత్యం: కుల శేఖర్

గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష

సంగీతం: ఆర్.పి.పట్నాయక్


పల్లవి: అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో చరణం 1: అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో ఒక్క మాట అయినా తక్కువేమి కాదే ప్రేమకు సాటేదీ లేదే రైలు బండి కూతే సన్నాయి పాట కాగా రెండు మనసులొకటయ్యేనా కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళ కాలి మువ్వ గొంతు కలిపెనా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో చరణం 2: ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి ఒడిలో చేరిందా ప్రేమ కంటి చూపుతోనే కొంటె సైగ చేసి కలవర పెడుతోందా ప్రేమ గాలిలాగ వచ్చి ఎద చేరెనేమో ప్రేమ గాలి వాటు కాదే మైనా ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా అందుకోవే ప్రేమ దీవెన అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో మ్మ్..

Jayam : Prema O Prema Song lyrics (ప్రేమ ప్రేమ ప్రేమ)

చిత్రం: జయం (2002)

సాహిత్యం: కుల శేఖర్

గానం: కే.కే (ఖైలాష్ ఖేర్)

సంగీతం: ఆర్.పి.పట్నాయక్


ప్రేమ ప్రేమ ప్రేమ....♡♡♡ ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా.... ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా.... కళ్ళలో నీరు నీవే గుండెలో కోత నీవే మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే కాలం ముళ్ళ ఒడిలో బతుకే పతనమా దైవం కరుణిస్తే మాదే విజయమా ప్రేమ ప్రేమ ప్రేమ... ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా.... ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా.... కనులే కరువైతే అందమెందుకు వనమే ముళ్ళైతే కంచె ఎందుకు కలలే కథలై బతుకే చితులై సాగే పయనం నీదా ప్రేమా.... ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా.... ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా.... కళ్ళలో నీరు నీవే గుండెలో కోత నీవే మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే కాలం ముళ్ళ ఒడిలో బతుకే పతనమా దైవం కరుణిస్తే మాదే విజయమా చెలియా శిల లేక కోవెలెందుకు జతగా నువు లేక నేను ఎందుకు మమతే కరువై మనసే బరువై లోకం నరకం కాదా ప్రేమా

Jayam : Veeri Veeri Song Lyrics (వీరి వీరి గుమ్మడి పండు)

చిత్రం: జయం (2002)

సాహిత్యం: కుల శేఖర్

గానం: ఆర్.పి.పట్నాయక్

సంగీతం: ఆర్.పి.పట్నాయక్



వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడుమూతలు దండాకోరు వీరి పేరేమి ఇది మనుషులు ఆడె ఆట అనుకొంటారె అంట ఆ దెవుడు ఆడె ఆట అని తెలిసెదెపుడంటా అయ్యో ఈ ఆటకి అంతే లేదు గా అయినా లోకానికి అలుపే రాదు గా యెవరికి వారొక తీరు చివరికి ఏమౌతారు పైనున్న దెవుడు గారు మీ తెలివికి జోహారు బంధం అనుకున్నది బండగ మారున దూరం అనుకున్నది చెంతకు చేరున

2, జులై 2021, శుక్రవారం

Jayam : Evvaru Emanna Song Lyrics (ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ)

చిత్రం:జయం(2002)

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: కులశేఖర్

గానం: R.P.పట్నాయక్, ఉష


ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ

ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ

నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమ

మెత్తని మనసులు ఏరోజూ వీడదు ఈ ప్రేమ

కులమూ మతమూ లేవంటుంది మనసుకి ఈ ప్రేమ

నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ

ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ


*కాలమొస్తే సిరిమల్లెతీగకి చిగురే పుడుతుంది

ఈడువస్తే ఈ పడుచుగుండెలో ప్రేమే పుడుతుంది

గొడుగు అడ్డుపెట్టినంతనే వానజల్లు ఆగిపోవునా

గులకరాయి వేసినంతనే వరదజోరు ఆగిపోవునా

ఏడులోకాలు ఏకం ఐనా ప్రేమను ఆపేనా


ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ

ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ


*ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన చక్కని వరమంట

ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ అలుపే రాదంట

కండలెంత పెంచుకొచ్చినా కొండలైతే దించలేరుగా

కక్షతోటి కాలుదువ్వినా ప్రేమనెవ్వరాపలేరుగా

ప్రేమకెపుడైనా జయమేగానీ ఓటమి లేదంట


ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ

ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ

నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమ

మెత్తని మనసులు ఏరోజూ వీడదు ఈ ప్రేమ

కులమూ మతమూ లేవంటుంది మనసుకి ఈ ప్రేమ

నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ .. శాశ్వతం ఈ ప్రేమ..


Jayam : Priyathama Telusuna Song Lyrics (ప్రియతమా తెలుసునా)

చిత్రం:జయం(2002)

సంగీతం: R.P.పట్నాయక్

సాహిత్యం: కులశేఖర్

గానం: R.P.పట్నాయక్, ఉష


ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీ కోసమే నేననీ కనుపాపలో రూపమే నీవని కనిపించని భావమే ప్రేమనీ ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా .. చిలిపి వలపు బహుశా మన కథకు మొదలు తెలుసా దుడుకు వయసు వరస అరె ఎగిరిపడకే మనసా మనసులో మాట చెవినెయ్యాలి సరసకే చేరవా వయసులో చూసి అడుగెయ్యాలి సరసమే ఆపవా నీకు సందేహమా.. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా .. తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన మనసు కనులు తెరిచా మన కలల జడిలో అలిసా చిగురు పెదవినడిగా ప్రతి అణువు అణువు వెతికా మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా మనసులో భాష మనసుకి తెలుసు నన్నిలా నమ్మవా ప్రేమ సందేశమా.. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీ కోసమే నేననీ కనుపాపలో రూపమే నీవని కనిపించని భావమే ప్రేమనీ