25, మే 2022, బుధవారం

Jeevana Tarangalu : Ee Jeevana Tarangalalo Song Lyrics (ఈ జీవనతరంగాలలో ...)

చిత్రం: జీవన తరంగాలు (1973)

సంగీతం: జె. వి. రాఘవులు

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల



పదిమాసాలు మోశావు పిల్లలను బ్రతుకంతా మోశావు బాధలను ... ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు ఈ జీవనతరంగాలలో ... ఆ దేవుని చదరంగంలో ... ఎవరికి ఎవరు సొంతమూ ... ఎంతవరకీ బంధమూ ... కడుపు చించుకు పుట్టిందొకరూ ...కాటికి నిన్ను మోసేదొకరూ ... తలకు కొరివి పెట్టేదొకరూ ... ఆపై నీతో వచ్చేదెవరూ ... ఆపై నీతో వచ్చేదెవరూ ... ఈ జీవనతరంగాలలో ... ఆ దేవుని చదరంగంలో ... ఎవరికి ఎవరు సొంతమూ ఎంతవరకీ బంధమూ... మమతే మనిషికి బంధిఖానా ... భయపడి తెంచుకు పారిపోయినా ... తెలియని పాశం వెంటపడి ... ఋణం తీర్చుకోమంటుంది ... తెలియని పాశం వెంటపడి ఋణం తీర్చుకోమంటుంది ... నీ భుజం మార్చుకోమంటుంది ... ఈ జీవనతరంగాలలో ... ఆ దేవుని చదరంగంలో ... ఎవరికి ఎవరు సొంతమూ ఎంతవరకీ బంధమూ ... తాళికట్టిన మగడు లేడనీ ... తరలించుకు పోయే మృత్యువాగదూ ... ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవూ ... ఆ కన్నీళ్ళకు చితిమంటలారవూ ... ఈ మంటలు ఆ గుండెను అంటక మానవూ ... ఈ జీవనతరంగాలలో ... ఆ దేవుని చదరంగంలో ... ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము ... ఈ జీవనతరంగాలలో ...ఓ .ఓ ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి