25, మే 2022, బుధవారం

Prema Sankellu : Merupula Merisavu Song Lyrics (మెరుపులా మెరిశావు.)

చిత్రం: ప్రేమ సంకెళ్లు (1982)

సంగీతం: రమేష్ నాయుడు

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల


F ఓహో... ఓ.. M ఓహో... ఓ... ఓహో... ఓ... F మెరుపులా మెరిశావు...వలపులా కలిశావు. కన్ను తెరిచి చూసేలోగా.నిన్నలలో నిలిచావు. నిన్నలలో నిలిచావు... మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు... కన్ను తెరిచి చూసేలోగా.నిన్నలలో నిలిచావు. నిన్నలలో నిలిచావు... చరణం 1: తెలుగు లిరిక్స్ కోసం follow jograo123 F మల్లెల కన్నీరు చూడు...ంచులా కురిసింది లేత ఎండ నీడలలో... నీ నవ్వే కనిపించింది వేసారిన బాటలలో... వేసవి నిట్టూర్పులలో... వేసారిన బాటలలో...వేసవి నిట్టూర్పులలో ... దోసిట నా ఆశలన్నీ...దోచి వెళ్ళిపొయావు ... M మెరుపులా మెరిశావు..వలపులా కలిశావు కన్ను తెరిచి చూసేలోగా.నిన్నలలో నిలిచావు. నిన్నలలో నిలిచావు చరణం 2: తెలుగు లిరిక్స్ కోసం follow jograo123 M ప్రాణాలన్ని నీకై..చలి వేణువైనాయి.. ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి... ప్రాణాలన్ని నీకై... చలి వేణువైనాయి ఊపిరి ఉయ్యాలూగే... ఎదే మూగ సన్నాయి... పసుపైనా కానీవా..పదాలంటుకొనీవా.. పాదాలకు పారాణై..పరవశించిపోనీవా... పలకరించిపోలేవా... మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు కన్ను తెరిచి చూసేలోగా.నిన్నలలో నిలిచావు. నిన్నలలో నిలిచావు... చరణం 3: తెలుగు లిరిక్స్ కోసం follow jograo123 F వేకువంటి చీకటి మీద..చందమామ జారింది M నీవు లేని వేదనలోనే... నిశిరాతిరి నిట్టూర్చింది... F తెల్లారని రాతిరిలా... M వేకువలో వెన్నెలలా... F తెల్లారని రాతిరిలా... M వేకువలో వెన్నెలలా... F జ్ఞాపకాల వెల్లువలోనే... కరిగి చెరిగిపోతున్నాను మెరుపులా మెరిశావు... వలపులా కలిశావు కన్ను తెరిచి చూసేలోగా.నిన్నలలో నిలిచావు. నిన్నలలో నిలిచావు... M మెరుపులా మెరిశావు..వలపులా కలిశావు కన్ను తెరిచి చూసేలోగా.. నిన్నలలో నిలిచావు... నిన్నలలో నిలిచావు ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి