10, మే 2022, మంగళవారం

K.G.F - 2 : Sulthana Lyrics (Dheera Dheera song lyrics)

చిత్రం: కే.జి. ఎఫ్ -2 (2022)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: శ్రీ కృష్ణ, పృథ్వి చంద్ర, అరుణ్ కౌండిన్య, సాయి చరణ్, సంతోష్ వెంకీ, మోహన్ కృష్ణ, సచిన్ బాసృర్, రవి బాసృర్, పునీత్ రుద్రనాగ్, మనీష్ దినకర్,హరిణి ఇవటూరి

సంగీతం: రవి బస్రూర్



రణ రణ రణ రణ ధీరా గొడుగెత్తె నీల గగనాలు, రణ రణ రణ రణ ధీరా పదమొత్తె వేల భువనాలు, రణ రణ రణ రణ ధీరా తలవంచె నీకు శిఖరాలు, రణ రణ రణ రణ ధీరా జేజేలు పలికె ఖనిజాలు. నిలువెత్తు నీ-కదము ముష్కరులపాలి ఉక్కు సమ్మెట.. అనితరము నీ పదము అమావాస్య చీల్చు అగ్గి బావుట.. రగిలే పొగిలే నిట్టూర్పులకు నీ వెనుదన్నే ఓదార్పు.. మా బ్రతుకిదిగో నీకై ముడుపు నడిపించర తూరుపువైపు.. ధీరా ధీరా ధీరా ధీరా సుర సుల్తానా

ధీరా ధీరా ధీరా ధీరా సుర సుల్తానా

ధీరా ధీరా ధీరా ధీరా సుర సుల్తానా [ఏయ్] కదమెత్తిన బలవిక్రముడై దురితమతుల పనిఁబట్టు! పేట్రేఁగిన ప్రతి వైరితల పుడమి వొడికి బలిపెట్టు! కట్టకటిక రక్కసుడె ఒక్కొక్కడు వేటుకొకడు ఒఱిగేట్టు వెంటబడు! సమరగమన సమవర్తివై నేఁడు శత్రుజనుల ప్రాణాల పైనఁబడు! తథ్యముగ జరిగితీరవలె కిరాతక దైత్యులవేట, ఖచ్చితముగ నీ ఖడ్గసిరి గుఱితప్పదెపుడు ఏ చోటా! రగిలే పొగిలే నిట్టూర్పులకు నీ వెనుదన్నే ఓదార్పు.. మా బ్రతుకిదిగో నీకై ముడుపు నడిపించర తూరుపువైపు.. జై జై జై

జై జై జై రణ రణ రణ రణ ధీరా గొడుగెత్తె నీల గగనాలు, రణ రణ రణ రణ ధీరా పదమొత్తె వేల భువనాలు, రణ రణ రణ రణ ధీరా తలవంచె నీకు శిఖరాలు, రణ రణ రణ రణ ధీరా జేజేలు పలికె ఖనిజాలు. నిలువెత్తు నీ-కదము ముష్కరులపాలి ఉక్కు సమ్మెట.. అనితరము నీ పదము అమావాస్య చీల్చు అగ్గి బావుట.. రగిలే పొగిలే నిట్టూర్పులకు నీ వెనుదన్నే ఓదార్పు.. మా బ్రతుకిదిగో నీకై ముడుపు నడిపించర తూరుపువైపు..

ధీరా ధీరా ధీరా ధీరా సుర సుల్తానా

ధీరా ధీరా ధీరా ధీరా సుర సుల్తానా

ధీరా ధీరా ధీరా ధీరా సుర సుల్తానా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి