24, మే 2022, మంగళవారం

Pelli Chesukundam : Manasuna Manasai Song Lyrics (మనసున మనసై )

చిత్రం: పెళ్లి చేసుకుందాం (1997)

సాహిత్యం: చంద్రబోస్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: కోటి

 


మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే తరగని వరమై ఎదల్లో సరగమ స్వరమై పెదాల్లో పాడుతోంది నువ్వే నీకు పరిచయమై తొలి ప్రేమ చవిచూశా నేను పరవశమై హృదయాన్ని పరిచేశా నువ్వే నా దైవంలా భావించా మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే ప్రియ జతలో సన్నిధిలో తెలిసెను సంక్రాంతి చెలి ఒడిలో మనుగడలో దొరికెను సుఖ శాంతి అడగక ముందే ఆమనిలా కనుల ముందే మెరిశావు గ్రహణము విడిచే జాబిలిలా తళుకుమంటూ వెలిగావు ప్రాణంలో ప్రాణంగా నిలిచావు మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే శిలలాంటి శిథిల వనం చిగురులు తొడిగింది కలయికతో ప్రణయ రథం పరుగులు తీసింది పిలిచిన పలికే పెన్నిదిలా వలపు నిధులే పంచావు అతిథిగా చేరి హారతిలా చలువ చెలిమే చిలికావు అందించా అర్పించా అణువణువు మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే నీకు పరిచయమై తొలి ప్రేమ చవి చూశా నేను పరవశమై హృదయాన్ని పరిచేశా నువ్వే నా దైవంలా భావించా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి