Pelli Chesukundam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pelli Chesukundam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, మే 2022, మంగళవారం

Pelli Chesukundam : Manasuna Manasai Song Lyrics (మనసున మనసై )

చిత్రం: పెళ్లి చేసుకుందాం (1997)

సాహిత్యం: చంద్రబోస్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: కోటి

 


మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే తరగని వరమై ఎదల్లో సరగమ స్వరమై పెదాల్లో పాడుతోంది నువ్వే నీకు పరిచయమై తొలి ప్రేమ చవిచూశా నేను పరవశమై హృదయాన్ని పరిచేశా నువ్వే నా దైవంలా భావించా మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే ప్రియ జతలో సన్నిధిలో తెలిసెను సంక్రాంతి చెలి ఒడిలో మనుగడలో దొరికెను సుఖ శాంతి అడగక ముందే ఆమనిలా కనుల ముందే మెరిశావు గ్రహణము విడిచే జాబిలిలా తళుకుమంటూ వెలిగావు ప్రాణంలో ప్రాణంగా నిలిచావు మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే శిలలాంటి శిథిల వనం చిగురులు తొడిగింది కలయికతో ప్రణయ రథం పరుగులు తీసింది పిలిచిన పలికే పెన్నిదిలా వలపు నిధులే పంచావు అతిథిగా చేరి హారతిలా చలువ చెలిమే చిలికావు అందించా అర్పించా అణువణువు మనసున మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే నీకు పరిచయమై తొలి ప్రేమ చవి చూశా నేను పరవశమై హృదయాన్ని పరిచేశా నువ్వే నా దైవంలా భావించా

1, జులై 2021, గురువారం

Pelli chesukundam : Kokila Kokila Ku Annadi Song Lyrics (కోకిల కోకిల కూ అన్నది)

చిత్రం: పెళ్లి చేసుకుందాం(`1997)

సంగీతం: కోటి

సాహిత్యం: సాయి శ్రీ హర్ష

గానం: బాలసుబ్రహ్మణ్యం , చిత్ర




కోకిల కోకిల కూ అన్నది

వేచిన ఆమని ఓయన్నది

దేవత నీవని మమతల కోవేల తలుపు తేరిచివుంచాను

ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో

సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో


కోకిల కోకిల కూ అన్నది.హ.హ.

వేచిన ఆమని ఓ యన్నది.హ.హ.


గుండె గూటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగ ఉండిపోవా

ఏడు అడుగుల తోడు రావా జన్మ జన్మ నన్ను నీడకావా

లోకం మన లోగిలిగా కాలం మన కౌగిళిగా

వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా

ఆ ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా.


కోకిల కోకిల కూ అన్నది.హ.హ.

వేచిన ఆమని ఓ అన్నది.హ.హ.


వాలు కళ్ళతో వీలునామా వీలు చూసి ఇవ్వు చాలు భామ

వేళపాలలు ఏలనమ్మా వీలు లేనిదంటూ లేదులేమ్మా

మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం

కాలన్నే ఆపగలం మన ప్రేమను చూపగలం

కల్లలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మ


కోకిల కోకిల కూ అన్నది

వేచిన ఆమని ఓ యన్నది

దేవత నీవని మమతల కోవేల తలుపు తేరిచివుంచాను

ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళ

19, జూన్ 2021, శనివారం

Pelli Chesukundam : Enno Enno Ragalu Unde Song Lyrics (ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా)

 చిత్రం: పెళ్లి చేసుకుందాం(1997)

సంగీతం: కోటి

గానం: బాలసుబ్రహ్మణ్యం , చిత్ర

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి



ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట సంద్రంలో సందడంతా చంద్రుడిలో వెన్నెలంతా చిన్నారి సంతానంగా చేరె మన ఇంట..హోయ్ ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత... ఏ పూటైనా హ్యాపీగా ఉందాం మనకొద్దు అంతకు మించి వేరే వేదాంతం ఏ బాటైనా పరవాలేదంట సమయంతో సాగటమే మన సింపుల్ సిద్ధాంతం చిరుగాలికి పరిమళమిచ్చే సిరి మల్లెల వనమై ఉందాం గగనాన్ని నేలను కలిపే హరివిల్లుల వంతెన అవుదాం ఆనందం అంటే అర్థం మనమందాం ప్రతి పూట పాటై సాగే హుషారు సరిగమలో అహహ్హ ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత..హ..హే..అహహ్హ ఓ డాడీ డాడీ Love you ఓ మమ్మీ మమ్మీ Love you we love you.. love you.. love you so much మమకారాలే పువ్వుల సంకెళ్ళై గత జన్మల ఋణబంధాలను గుర్తుకు తెస్తాయి అనురాగాలే గుండెల సవ్వల్లై బతుకంటే ఎంతో తీపని చెబుతూ ఉన్నాయి వరమల్లె దొరికినదేమో అరుదైన ఈ అనుబంధం సిరులున్నా దొరకనిదేమో సరదాలకు ఈ సావాసం చిరకాలం చిగురులు వేస్తూ ఎదగాలి ఏ చింతా చెంతకు రాని అందాల ఈ సందడి హా..ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట హే..సంద్రంలో సందడంతా చంద్రుడిలో వెన్నెలంతా చిన్నారి సంతానంగా చేరె మన ఇంట..హోయ్