చిత్రం: ప్రేమతో రా.. (2001)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: శ్రీనివాస్
సంగీతం: మణి శర్మ
ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ ఓ అవునో కాదో అడిగే వీలే లేదా మౌనమా పగ సాధించే పంతం మాని చెలిమే పంచుమా ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ నిలువెల్లా గాయాలే కలిగిస్తూ ఉన్నా శిల లాంటి నను మలిచి వులివే అనుకున్నా నువు కోరే రూపంలో కనిపిస్తూ ఉన్నా వెలివేసి వెళుతుంటే విల విల మంటల్లో నాకు మనసుందంటూ చూపావే నేస్తమా ఆ మనసును ఒంటరిగా విరిచేస్తే న్యాయమా నీపై నీకే నమ్మకముంటే మౌనం మానుమా నా హ్రిదయం నీ కోవెలయ్యింది కొలువై ఉండుమా ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ హో
Super super super
రిప్లయితొలగించండి