3, మే 2022, మంగళవారం

Ravoyi Chandamama : Jum jummani Song Lyrics (జుం ఝమ్మని జుమ్మని)

చిత్రం: రావోయి చందమామ (1999)

సంగీతం:మణి శర్మ

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి:

జుం ఝమ్మని జుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి..
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి...
వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు...
మధుమాసం మనసుకు వచ్చే వేళలో...
కన్నుల కలువల్లో సరిగమల సరాగాలు...
శుభమంగళ వాద్యాలొచ్చే వేళలో....
జుం జుమ్మని జుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి..
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి..

చరణం: 1

ఆకాశానికీ తారలు పొదిగిన నా ఆనందంలో....
పల్లవించే నా గీతం...పలకరించే సంగీతం...
ఆ స్వర్గానికి నిచ్చెన వేసిన నా ఆవేశంలో...
తరుముకొచ్చే ఉల్లాసం...తనను పంచె కైలాసం...
ఒక్కసారి వస్తే తీయని క్షణాలెన్నో....
ఒక్కటవ్వమంటూ తీరని ఋణాలే....
శుభలేఖనుకో నా గీతం...
జుం జుమ్మని జుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి...
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి....

చరణం: 2

నీ పాదాలకు పారాణి అద్దిన ఈ పేరంటంలో
దేవతాయే నీ రూపం..దీవనాయే నా ప్రాణం...
వయ్యారాలను ఉయ్యాలలూపిన ఈ వైభోగంలో...
మౌనమయే నా భావం..రాగమాయే నీ కోసం...
మూడుముళ్ళ బంధం..ఏడు జన్మల అనుబంధం..
వేణువయిన నాలో..ఆలపనైన గానం
ఆశీస్సనుకో అనురాగము....
జుం జుమ్మని జుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి..
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి...
వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు...
మధుమాసం మనసుకు నచ్చే వేళలో...
కన్నుల కలువల్లో సరిగమల సరాగాలు..
శుభమంగళ వాద్యాలొచ్చే వేళలో....
జూమ్ జుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి...
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి