22, మే 2022, ఆదివారం

RRR : Dosti Song Lyrics (పులికి విలుకాడికి)

చిత్రం: రౌద్రం రణం రుధిరం(RRR) (2021)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: హేమచంద్ర

సంగీతం: ఎం.ఎం.కీరవాణి



పులికి విలుకాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి రవికి మేఘానికి (దోస్తీ దోస్తీ) ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో (దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దం దరదం దం దందం) (బడబాగ్నికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ) (దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దం దరదం దం దందం) (సుమ్మరి యారే యారే యరి యారే సొరియారి యారి యరి యరి యరె యరె) అనుకోని గాలిదుమారం (చెరిపింది ఇరువురి దూరం) ఉంటారా ఇకపై ఇలాగ వైరమే కూరిమై నడిచేది ఒకటే దారై (వెతికేది మాత్రం వేరై) తెగిపోదా ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై (తొందరపడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగుల ముందుగ తెలియదు ఎదురువచ్చే తప్పని మలుపులేవో) ఊహించని (చిత్ర విచిత్రం) స్నేహానికి (చాచిన హస్తం) ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో (దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దం దరదం దం దందం) (బడబాగ్నికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ) ఒక్క చెయ్యి రక్షణ కోసం (ఒక్క చెయ్యి మృత్యు విలాసం) బిగిశాయి ఒకటయి ఇలా తూరుపు పడమర ఒకరేమో దారుణ శస్త్రం (ఒకరేమో మారణ శాస్త్రం) పేరతొలగి పొతే ప్రచండ యుద్ధమే జరగదా (తప్పని సరియని తరుణం ఒస్తే జరిగే జగడమురో ఓటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చేవారివురురో) ఊహించని (చిత్ర విచిత్రం) స్నేహానికి (చాచిన హస్తం) ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో (దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దరదం దరదం దరదం దం దం దరదం దం దందం) (బడబాగ్నికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి