చిత్రం: శ్రీమతి (1994)
సంగీతం: శ్రీ నిత్యానంద్
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల ,పి. సుశీల
ఆమె:- మ్రోగింది గుడిలోని గంట మురిసింది హృదయాల జంట నీలో నాలో వెలిగే ప్రేమా నింపింది కిరణాల పంట నా మనసే ప్రియ నీవుండే విడిదీ నాలో పొంగింది ఆనంద జలధీ అతడు:- వికసించే మనోభావాలు కలిసే పెండ్లి పందిరిగా లోకమె వెలసే ఆమె:- నీవే నేనుగా ఒకటైన చోట నీవే నేనుగా ఒకటైన చోట పూచే వలపుల తోట.. అతడు:- మ్రోగింది గుడిలోన గంట ఆమె:- మురిసింది హృదయాల జంట అతడు:- నీలో నాలో వెలిగే ప్రేమా ఆమె:- నింపింది కిరణాల పంటా... ఆమె:- ప్రేమించి నిను సేవించుదానా ఇల్లాలినైనాను ఈ ముహూర్తానా అతడు:- దేవతలే చెలీ దీవించినారు ఇద్దరినొకటిగా కావించినారు ఆమె:- ఎపుడు మనలో ఎడబాటు లేక ఎపుడు మనలో ఎడబాటు లేక బ్రతుకే పువ్వుల బాటా ఇద్దరు:- మ్రోగింది గుడిలోన గంట మురిసింది హృదయాల జంట నీలో నాలో వెలిగే ప్రేమా నింపింది కిరణాల పంటా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి