25, జూన్ 2022, శనివారం

Pelli Pustakam : Sarikotta Cheera Song Lyrics (సరికొత్త చీర ఊహించినాను)

చిత్రం : పెళ్ళిపుస్తకం (1991)

సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం




సరికొత్త చీర ఊహించినాను సరదాల సరిగంచు నేయించినాను మనసు మమత బడుగు పేద చీరలో చిత్రించినాను ఇది ఎన్నోకలల కల నేత నా వన్నెల రాశికి సిరి జోత నా వన్నెల రాశికి సిరి జోత ముచ్చట గొలిపే మొగలి పొద్దుకు ముళ్ళు వాసన ఒక అందం అభిమానం గల ఆడపిల్లకు అలక కులుకు ఒక అందం ఈ అందాలన్నీ కలబోశా నీ కొంగుకు చెంగున ముడి వేస్తా ఈ అందాలన్నీ కలబోశా నీ కొంగుకు చెంగున ముడి వేస్తా ఇది ఎన్నోకలల కల నేత నా వన్నెల రాశికి సిరి జోత నా వన్నెల రాశికి సిరి జోత చుర చుర చూపులు ఒక మారు నీ చిరు చిరు నవ్వులు ఒక మారు మూతి విరుపులు ఒక మారు నువు ముద్దుకు సిద్దం ఒక మారు నువు ఏ కలనున్నా మా బాగే ఈ చీర విశేషం అల్లాగే నువు ఏ కలనున్నా మా బాగే ఈ చీర విశేషం అల్లాగే సరికొత్త చీర ఊహించినాను సరదాల సరిగంచు నేయించినాను మనసు మమత బడుగు పేద చీరలో చిత్రించినాను ఇది ఎన్నోకలల కల నేత నా వన్నెల రాశికి సిరి జోత నా వన్నెల రాశికి సిరి జోత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి