చిత్రం : పెళ్ళిపుస్తకం (1991)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
ప ప ప ప ప పప్పు దప్పళం
ప ప ప ప ప పప్పు దప్పళం
అన్నం నెయ్యి వేడి అన్నం కాచిన్నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నెయ్యి
వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నెయ్యి పప్పు దప్పళం కలిపి కొట్టడం ...
భొజనం వనభోజనం.. వనభోజనం జనరంజనం
తల్లి తోడు.. పిల్ల మేక .. ల ల...
తల్లి తోడు.. పిల్ల మేక.. ఆలు మగలు.. అత్తా కోడలు.. బాసు బంటు.. ఒకటేనంటు కలవడం..
భొజనం వనభోజనం.. భొజనం.... వనభోజనం
మన వయసుకు నచ్చినట్టి ఆటలు.. మన మనసుకు వచ్చినట్టి పాటలు..ఆ...
మన వయసుకు నచ్చినట్టి ఆటలు.. మన మనసుకు వచ్చినట్టి పాటలు..పసనిస పనిదని మదపదమప సగమమ దమమగరి పాడితే
రంజనం జనరంజనం రా రా ర రంజనం జనరంజనం
మేరు స.. స స... మేరు రి.. రి రి.. తమరు గ.. గ గ..
మేము ప ప ప ప ప వేరిగుడ్ .. మేము ద ద ద ద ద..శభాష్
ని ని ని ని ని.. మరల సా....
వేరిగుడ్ బావుంది బావుంది బావుంది
ఆ ఇప్పుడు నేను ఎవర్ని చూపిస్తె వాళ్ళ స్వరం పాడాలి.. ఏ.. ఊం... రెడియా..
సరిగ..సారిగ మ మ మ మ .. రిగమ రీగమా ప ప ప ప
తక్కిట తకధిమి తరికిటతక తరికిటతక
మసాలా గారెలో మామా
జిలేబి బాదుషా పాపా
సమోసా తీసుకో దాదా
పొటాటో చిప్సుతోనా నీనీ
మిఠాయి కావురే యేడం ..
పకోడి తిందువ పా ప
మలాయి పెరుగిది మ మ
టొమాటో ఛట్నితొ ద ద
పసందు పూర్ణమూ భూరి
నంజుకో కారప్పూసా...
అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్మార్కు మిరపకాయల బజ్జి కొరికి చూడు..
గోంగూర పచ్చడి.. గొడ్డు కారపు ముద్ద మినపట్టు ముక్కతో మింగి మెసవి చూడూ...
ఉల్లిపాయల మధ్య అల్లమ్ము చల్లిన పెసరట్టు ఉప్మతో మెసవి చూడూ
గసగసాల్ మిరియాలు కారాలవంగాలు నాణ్యమౌ యాలకులు నమిలి చూడూ...
తెలుగుతనమున్న తిండిని తిన్నవాడు తనకు తెలియక హాయిగా తనువు వూగ పాట పాడును తప్పక ఆటలాడు డాన్సు రానట్టి వారైన డాన్సు సేయూ... ఆ.. ఆ...
శ్రీమన్ మహాదోమ నీ కుట్టడం మండ ఘీ పెట్టడం ఎండ నీ గోల ఉద్వేల కోలహలాభీల హాలాహలజ్వాల గీరాకరాళాగ్ని విఘ్నం హుఘ్నం కావాలి
నా రెండు కర్ణాల నీ మొండి గానాల నాలించగా నేను.. ఆ.. నీవేమి ట్రాన్సిస్టరా లేక దాన్ సిస్టరా..
నీదు అంగికౄతంగాని సంగీతమున్నీవు .. డామిట్టు.. డామిట్టు.. స్టాపిట్టు.. స్విచ్చాఫు..
నాపాలి భూతంబ ఆపాలి ఘాతంబు శాకిని ఢాకిని గాలి దెయ్యంబా..
చి చి ఓసే పాతకి ఘాతకీ ఇదే చూడవే ఘాత నీ రాత నా చేత పట్టిచ్చెనే..
నిన్ను తోల్తొన్న పేల్తావు వెంటడి వెంటాడి గీపెట్టి చంపేయుచున్నావూ..
ఈ చేత నిన్ బట్టి ఆ చేతితొ కొట్టి కిందెట్టి మీదెట్టి రెట్టించి దట్టించి నవ్వేతునే..
పాడు దోమ హరామ గులామ అయ్యో రామ రామా...సమాప్తం ..సమాప్తం..సమాప్తం...... సమాప్తం...
జింతన తన తన.. జిం జింతన తన తన
అరిశెలు భూరెలు వడలు ఆవడ బోండలు కజ్జికాయలు
కరకరలాడు జంతికలు.. కమ్మని ఘుంమ్మని నేతి చిప్సులు ..
సరిగమ పదమప గమగరి సరి సససససా...
అరిశెలు భూరెలు వడలు ఆవడ బోండలు కజ్జికాయలు
కరకరలాడు జంతికలు.. కమ్మని ఘుంమ్మని నేతి చిప్సులు ..
కరమగు నోరు ఊరగల కక్కలు ముక్కలు ఫిష్ కబాబులు. ష్... అమ్మమ్మామ్మమ్మా....
కరమగు నోరు ఊరగల కారపు పచ్చడి తీపి జాంగిరి..
త్వరత్వర సర్వు చేయమని తైతకలాడగ పిక్కునిక్కులు
త్వరత్వర సర్వు చేయమని తైతకలాడగ పిక్కునిక్కులు
తైతక తైతక తైతక తై తై తై...
తకధిన్నధిన్న తకధిన్నధిన్న తాంగిటతక తిరికిటతక ధిగి ధిగి ధిగి
తకతకిట తకతకిట తకతకిట తదిగిణతోం తదిగిణతోం తదిగిణతోం
ఆ..
తాంగిటతక తరికిటతకధిమి తాంగిటతక తరికిటతకధిమి తాంగిటతక తరికిటతకధిమి త త త త ..
ధిం తనకధిన ధిం తనకధిన ధిధిం తనకధిన ధిం తనకధిన తకధిమి తకధిమి తకధిమి తకధిమి తకధిమి
అహా.. ఓహో.. అహా.. తరికిట తరికిట తరికిట తరికిట..
ధిధిధిధి నకధిన.. ధిధిధిధి నకధిన.. ధిధిధిధి నకధిన..
ధిధిధిధి నకధిన.. ధిధిధిధి నకధిన.. ధిధిధిధి నకధిన..
తరికిట తరికిట తరికిట తరికిట తరికిట తరికిట తరికిట తరికిట
ధిత్తాంగి తరికిట థా...