12, అక్టోబర్ 2022, బుధవారం

Bimbisara : Neetho Unte Chalu Song Lyrics (గుండే దాటి గొంతు దాటి.)

చిత్రం : బింబి సార (2022)

సంగీతం : ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం : ఎం. ఎం. కీరవాణి
గానం: మోహన భోగరాజు, శాండిల్య పిసాపాటి




గుండే దాటి గొంతు దాటి.. పలికిందేదో వైనం మోడువారిన మనసులోనే.. పలికిందేదో ప్రాణం ఆ కన్నుల్లోనే.. గంగై పొంగిన ఆనందం కాలంతో.. పరిహాసం చేసిన స్నేహం పొద్దులు దాటి.. హద్దులు దాటి.. జగములు దాటి.. యుగములు దాటి.. చెయ్యందించమంది.. ఒక పాశం ఋణపాశం.. విధి విలాసం చెయ్యందించమంది.. ఒక పాశం ఋణపాశం.. విధి విలాసం అడగాలె కానీ.. ఏదైన ఇచ్చే.. అన్నయ్యనవుతా పిలవాలె కానీ.. పలికేటి.. తోడు నీడై పోతా నీతో ఉంటే చాలు.. సరితూగవు సామ్రాజ్యాలు రాత్రి పగలు.. లేదే దిగులు.. తడిసె కనులు.. ఇదివరకెరుగని ప్రేమలో.. గారంలో చెయ్యందించమంది.. ఒక పాశం ఋణపాశం.. విధి విలాసం ప్రాణాలు ఇస్తానంది.. ఒక బంధం.. ఋణ బంధం నోరార వెలిగే.. నవ్వుల్ని నేను.. కళ్ళార చూశా రెప్పల్లొ ఒదిగే.. కంటిపాపల్లొ.. నన్ను నేను కలిసా నీతో ఉంటే చాలూ.. ప్రతి నిమషం ఓ హరివిల్లు రాత్రి పగలు.. లేదే గుబులు మురిసే ఎదలు.. ఇదివరకెరుగని ప్రేమలో.. గారంలో ప్రాణాలు ఇస్తానంది.. ఒక పాశం.. ఋణపాశం.. విధి విలాసం చెయ్యందించమంది.. ఒక బంధం.. ఋణ బంధం ఆటల్లోనే పాటల్లోనే.. వెలసిందేదో స్వర్గం రాజే నేడు.. బంటైపోయిన రాజ్యం.. నీకే సొంతం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి