చిత్రం : బింబి సార (2022)
సంగీతం : వరికుప్పల యాదగిరి
సాహిత్యం : వరికుప్పల యాదగిరి
గానం: హైమత్ మహమ్మద్, సత్య యామిని
తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే ఓ కోర మీసపు అబ్బాయి నీ ఓర చూపుల లల్లాయి బాగుందోయ్, ఓ ఓ నీ చెంపల నులుపు, బుగ్గల ఎరుపు… ఊరిస్తున్నాయ్ నీ మాటల విరుపు ఆటాల ఒడుపు గుండెపట్టుకొని ఆడిస్తున్నాయ్ నీ వెంట వెల్లమని తిట్టేస్తున్నాయ్ నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్ నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్ నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్ గోడచాటు నీ దొంగ చూపులు మంట పెట్టి పోతున్నాయ్ పట్టు పరుపులు మల్లె పాన్పులు నచ్చకుండా చేస్తున్నాయ్ మూతి విరుపులు తీపి తిప్పలు రెచ్చగొట్టి చూస్తున్నాయ్ సోకు కత్తులు హాయి నొప్పులు నొక్కి నొక్కి నవ్వుతున్నాయ్ నీ తిప్పల తలుపులు మోహపు తలుపులు తియ్య తియ్యమని బాధేస్తున్నాయ్ నీ వెంట వెల్లమని తిట్టేస్తున్నాయ్ నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్ నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్ నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్ ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే.. ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి