చిత్రం : మనసంతా నువ్వే (2002)
సంగీతం : ఆర్.పీ.పట్నాయక్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ఉష, సంజీవని
తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా దూరంగా పోనీక ఉంటగా నీ వెనకాలే రానీ సాయంగా ఆ వంకా ఈ వంకా తిరిగావె ఎంచక్కా ఇంకానా చాలింకా... ఇంతేగా నీ రెక్కా ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా దొసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా వదిలేయకు సీతాకోక చిలకలుగా వామ్మొ బాగుందె ఇట్టా నాకూ నేర్పిస్తె చక్కా సూర్యుడ్నె కరిగిస్తాగా చినుకులుగా సూర్యుడు ఏడీ నీతో ఆడీ చందమామ అయిపొయ్యాడుగా తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా ఆ కొంగలు ఎగిరీ ఎగిరీ సాయంత్రం గూటికి మళ్ళీ తిరిగొచ్చె దారిని యెపుడూ మరిచిపోవెలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి