చిత్రం: చిత్రం (2000)
సంగీతం: R.P. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర
గానం: ఉష
పల్లవి : ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా॥ కలహంసై కబురులందివ్వనా రాచిలకై కిలకిల నవ్వనా నా పెదవుల మధువులే ఇవ్వనా సయ్యాటలోనా॥
చరణం : 1
ప్రేమలొ తీపిచూసే వయసె నీదిరా బ్రతుకులో చేదులున్న భయమె వద్దురా సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా సిరి తానుగానె వచ్చి నిన్ను చేరునురా
మేఘాలకు నిచ్చెనే వేయనా
ఆకాశపుటంచులే వంచనా
ఆ జాబిలి కిందకే దించనా
నా కన్నెకూన॥
చరణం : 2
ఆశగా పల్లవించే పాటే నీవులే జీవితం తోడులేని మోడే కాదులే కలిసుండే వేళలో కలతంటూ రాదులే అమావాసై పొదులే అడియాశే కాదులే చిరు దివ్వె గొంతు ఇంక దారి చూపునులే ఊహల పల్లకిలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా మేఘాలకు నిచ్చెనె వేయనా ఆకాశపుతంచులె వంచనా ఆ జాబిలె కిందకె దించనా నా కన్నెకూనా ఊహల పల్లకిలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా ఊహల పల్లకిలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి