చిత్రం: ఆరెంజ్(2010 )
సంగీతం: హర్రీస్ జయరాజ్
సాహిత్యం: వనమాలి
గానం: కార్తీక్
పల్లవి :
చిలిపిగా చూస్తావలా, పెనవేస్తావిలా నిన్నే ఆపేదేలా..
చివరికి నువ్వే అలా, వేస్తావె వల, నీతో వేగేదెలా...
ఓ ప్రేమ కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుంది నీ కల
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తుంది.. ఆపై చేదెక్కుతోందిలా
కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదేలా...
చిలిపిగా చూస్తావలా, పెనవేస్తావిలా నిన్నే ఆపేదేలా..
చివరికి నువ్వే అలా, వేస్తావె వల, నీతో వేగేదెలా...
చరణం : 1
నిన్నే ఇలా... చేరగా.....మాటే మార్చి మాయె చెయ్యాలా... నన్నే ఇక నన్నుగా.... ప్రేమించని ప్రేమేగా... ఊపిరే... ఆగేదాకా.... ఏదో ఒక తోడు౦డాలా... నన్నింతగా... ఊరించేస్తూ అల్లేస్తుంది నీ సంకెళ కొంచెం మధురము కొంచెం విరహము....ఇంతలో నువ్వు నరకం కొంచెం స్వర్గము కొంచెం శాంతము గొంతులో జారు గరళం కొంచెం పరువము కొంచెం ప్రణయము గుండెనే కోయు గాయం కొంచెం మౌనము కొంచెం గానము ఎందుకే ఇంద్రజాలం ఇన్నాళ్ళుగా సాగిన ప్రేమనుంచి వేరై పోతున్నా... మళ్ళీ మరో గుండెతో.... స్నేహం.... కోరి వెళ్తున్నా ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా... ఒక్కో క్షణం ఆ సంతోషం... నాతో పాటు సాగేదెలా ఎలా... చిలిపిగా చూస్తావలా, పెనవేస్తావిలా నిన్నే ఆపెదేలా.. చివరికి నువ్వే అలా, వేస్థావె వల, నీతో వేగేదెలా... ఓ ప్రేమ కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుంది నీ కల కొన్నాళ్ళే అందంగా ఊరిస్తుంది ఆపై చేదేక్కుతోందిలా కడదాకా ప్రేమించే... దారేదో పోల్చేదేలా... కొంచెం మధురము కొంచెం విరహము ఇంతలో నువ్వు నరకం రంప౦పర రంపంపర రంపా రంపపంపం కొంచెం పరువము కొంచెం ప్రణయము గుండెనే కోయు గాయం రంప౦పర రంపంపర రంపా రంపపంపం కొంచెం మధురము కొంచెం విరహము.... కొంచెం పరువము కొంచెం ప్రణయము...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి