చిత్రం: ఆరెంజ్(2010 )
సంగీతం: హర్రీస్ జయరాజ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: విజయ్ ప్రకాష్, దేవం ఏకాంబరం, డి.బర్న్
పల్లవి :
హలో రమ్మంటే వచ్చేసిందా చెలీ నీ పైన ఈ ప్రేమ
పో పో పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా
ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
నిజంలా నిన్ను చూడందే ఊరుకోదమ్మా
నా మనసిది ఓ ప్రేమ నది
నా గుండె తడి నీ పై వెల్లువై పొంగినది
చరణం : 1
24 కారట్ లవ్లీ ప్రేమ
24/7 నీపై కురిపిస్తున్నా
యెంత నువ్వు నన్ను తిట్టుకున్నా
ఎవిరి సెకండ్ నీకై పడి చస్తున్నా
7 రంగులుగ సులువుగా....
7 రంగులుగ సులువుగ విడిపడి పోని తెల్ల తెల్లనైన మనసిది
ఎన్నో కలలుగా విరిసిన పువ్వుల రుతువై నీకొరకే చూస్తున్నది
నువ్వంటే ఇష్టమంటోంది
సరేలెమ్మంటు బదులిస్తే తప్పేముంది
చరణం : 2
అందమైన కలలు చూస్తూ ఉన్నా అందులోన నేను నీతో ఉన్నా అంతుపంతులేని ఆనందాన ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసుతో గంగాలాంటి నా ప్రేమ ఇది జీవనది డార్లింగ్ చేతులారా గుండెలో నింపుకో సరే నువ్వెంత వద్దన్నా ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమలోన ఓ.....
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి