19, నవంబర్ 2022, శనివారం

Vasantam : Godaralleponge Song Lyrics (గోదారల్లె పొంగే నాలో సంతోషం)

చిత్రం: వసంతం(2003)

రచన: కుల శేఖర్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: S.A.రాజ్ కుమార్




గోదారల్లె పొంగే నాలో సంతోషం గోరింతల్లె పూచే నాలో ఆనందం హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస కలహంస నడకల్లోన అందాల హైలస్సా నేడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం నిండా నింపిదమ్మా నాలో సంగీతం గోదారల్లె పొంగే నాలో సంతోషం గోరింతల్లె పూచే నాలో ఆనందం గుండెలో వేల ఆశలే నన్ను ఇంతగా పెంచాయిలే కళ్ళలో కోటి కాంతులే పలు వింతలే చూపాయిలే సంక్రాంతే రోజు నామదికి ఈ అనుభవమే నాకు కొత్త గున్నది రానంటునే వచ్చిందమ్మా కొంటె కోయిల రాగాలెన్నో తీసివమ్మా తియ్యతీయగా  గోదారల్లె పొంగే నాలో సంతోషం గోరింతల్లె పూచే నాలో ఆనందం గాలిలో మబ్బు రేకులా మనసెందుకో తేలిందిలే హాయిగా పండు వెన్నెల పగలే ఇలా జారిందిలే సందేహం లేదే నాకు మరి ఇది ఆనందం చేసే కొంటె అల్లరి గుండెల్లోన ఉండాలంటే ఎపుడూ ఆరాటం మాటల్లోన చెప్పాలంటే బ్రతుకే పోరాటం  గోదారల్లె పొంగే నాలో సంతోషం గోరింతల్లె పూచే నాలో ఆనందం హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస కలహంస నడకల్లోన అందాల హైలస్సా నేడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం నిండా నింపిదమ్మా నాలో సంగీతం



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి