చిత్రం: రంగ్ దే (2020)
సాహిత్యం: శ్రీ మని
గానం: కపిల్ కపిలన్ & హరి ప్రియ
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఏమిటో ఇది వివరించలేనిది మది ఆగమన్నది తనువు ఆగనన్నది భాషలేని ఊసులాట సాగుతున్నది అందుకే ఈ మౌనమే బాషా అయినది కోరుకొని కోరికేదో తీరుతున్నది ఏమిటో ఇది వివరించలేనిది మది ఆగమన్నది తనువు ఆగనన్నది అలలా నా మనసు తేలుతుందే… వలలో నువ్వు నన్ను అల్లుతుంటే కలలా చేజారి పోకముందే శిలలా సమయాన్ని నిలపమందే… నడక మరిచి నీ అడుగు ఒడిన నా అడుగు ఆగుతుందే నడక నేర్చి నీ పెదవి పైన నా పెదవి కదులుతుందే ఆపలేని ఆట ఎదో సాగుతున్నది ఓ… ఏమిటో ఇది వివరించలేనిది మది ఆగమన్నది తనువాగనన్నది మెరిసే ఒక కొత్త వెలుగు నాలో… కలిపే ఒక కొత్త నిన్ను నాతో నేనే ఉన్నంత వరకు నీతో నిన్నే చిరునవ్వు విడువదనుకో… చినుకు పిలుపు విని నెమలి ఫించమున రంగులెగిసినట్టు వలపు పిలుపు విని చిలిపి మనసు చిందేసే ఆగనంటు కోరుకున్న కాలమేదో చేరుతున్నది ఓ... ఏమిటో ఇది వివరించలేనిది మది ఆగమన్నది తనువు ఆగనన్నది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి