Rang De లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rang De లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జనవరి 2023, శనివారం

Rang De : Emito Idhi Lyrics ( ఏమిటో ఇది వివరించలేనిది)

చిత్రం: రంగ్ దే (2020)

సాహిత్యం: శ్రీ మని

గానం: కపిల్ కపిలన్ & హరి ప్రియ

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



ఏమిటో ఇది వివరించలేనిది మది ఆగమన్నది తనువు ఆగనన్నది భాషలేని ఊసులాట సాగుతున్నది అందుకే ఈ మౌనమే బాషా అయినది కోరుకొని కోరికేదో తీరుతున్నది ఏమిటో ఇది వివరించలేనిది మది ఆగమన్నది తనువు ఆగనన్నది అలలా నా మనసు తేలుతుందే… వలలో నువ్వు నన్ను అల్లుతుంటే కలలా చేజారి పోకముందే శిలలా సమయాన్ని నిలపమందే… నడక మరిచి నీ అడుగు ఒడిన నా అడుగు ఆగుతుందే నడక నేర్చి నీ పెదవి పైన నా పెదవి కదులుతుందే ఆపలేని ఆట ఎదో సాగుతున్నది ఓ… ఏమిటో ఇది వివరించలేనిది మది ఆగమన్నది తనువాగనన్నది మెరిసే ఒక కొత్త వెలుగు నాలో… కలిపే ఒక కొత్త నిన్ను నాతో నేనే ఉన్నంత వరకు నీతో నిన్నే చిరునవ్వు విడువదనుకో… చినుకు పిలుపు విని నెమలి ఫించమున రంగులెగిసినట్టు వలపు పిలుపు విని చిలిపి మనసు చిందేసే ఆగనంటు కోరుకున్న కాలమేదో చేరుతున్నది ఓ... ఏమిటో ఇది వివరించలేనిది మది ఆగమన్నది తనువు ఆగనన్నది

Rang De : Naa Kanulu Yepudu Song Lyrics (నా కనులు ఎపుడూ కననె కనని)

చిత్రం: రంగ్ దే (2020)

సాహిత్యం: శ్రీ మని

గానం: సిద్ శ్రీరామ్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



నా కనులు ఎపుడూ కననె కనని పెదవులెపుడూ అననె అనని హృదయమెపుడూ విననె విననీ మాయలో తేలుతున్నా నా మనసు తలుపే… తెరచి తెరచి వెలుగు తెరలే… పరచి పరచి కలలు నిజమై… ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన చేదుపై తీపిలా… రేయిపై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు… పండుగ ఈ వేళా నా కనులు ఎపుడూ కననె కనని పెదవులెపుడూ అననె అనని హృదయమెపుడూ విననె విననీ మాయలో తేలుతున్నా నా మనసు తలుపే… తెరచి తెరచి వెలుగు తెరలే… పరచి పరచి కలలు నిజమై… ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన ఎపుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో ఎపుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ సొంతమై అందేనే గుప్పెడు గుండెకు… పండుగ ఈ వేళా నా కనులు ఎపుడూ కననె కనని పెదవులెపుడూ అననె అనని హృదయమెపుడూ విననె విననీ మాయలో తేలుతున్నా నన్నే నేనే కలిసానో ఏమో నాకే నేనే తెలిసానో ఏమో నీలో నన్నే చూశానో ఏమో నాలా నేనే మారానో ఏమో నా గతంలో నీ కథెంతో నీ గతంలో నా కథంతే ఓ క్షణం పెంచిన గుప్పెడు గుండెకు… పండుగ ఈ వేళా నా కనులు ఎపుడూ కననె కనని పెదవులెపుడూ అననె అనని హృదయమెపుడూ విననె విననీ మాయలో తేలుతున్నా నా మనసు తలుపే… తెరచి తెరచి వెలుగు తెరలే… పరచి పరచి కలలు నిజమై… ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన










30, అక్టోబర్ 2022, ఆదివారం

Rang De : Oorantha Song Lyrics (ఊరంతా వెన్నెల )

చిత్రం : రంగ్ దే  (2020)

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం : శ్రీ మని

గానం: మంగ్లి


ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడుగుని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇవి ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఎవరికీ చెప్పవే ఎవరిని అడగవే మనసులో ప్రేమకే మాటలే నేర్పవే చూపుకందని మచ్చను కూడా చందమామలో చూపిస్తూ చూపవలసిన ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ ఎన్నో రంగులున్న బాధ రంగే బ్రతుకులో ఒలికిస్తూ ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్నికలలు కని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథని మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః