చిత్రం: రంగ్ దే (2020)
సాహిత్యం: శ్రీ మని
గానం: సిద్ శ్రీరామ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నా కనులు ఎపుడూ కననె కనని పెదవులెపుడూ అననె అనని హృదయమెపుడూ విననె విననీ మాయలో తేలుతున్నా నా మనసు తలుపే… తెరచి తెరచి వెలుగు తెరలే… పరచి పరచి కలలు నిజమై… ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన చేదుపై తీపిలా… రేయిపై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు… పండుగ ఈ వేళా నా కనులు ఎపుడూ కననె కనని పెదవులెపుడూ అననె అనని హృదయమెపుడూ విననె విననీ మాయలో తేలుతున్నా నా మనసు తలుపే… తెరచి తెరచి వెలుగు తెరలే… పరచి పరచి కలలు నిజమై… ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన ఎపుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో ఎపుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ సొంతమై అందేనే గుప్పెడు గుండెకు… పండుగ ఈ వేళా నా కనులు ఎపుడూ కననె కనని పెదవులెపుడూ అననె అనని హృదయమెపుడూ విననె విననీ మాయలో తేలుతున్నా నన్నే నేనే కలిసానో ఏమో నాకే నేనే తెలిసానో ఏమో నీలో నన్నే చూశానో ఏమో నాలా నేనే మారానో ఏమో నా గతంలో నీ కథెంతో నీ గతంలో నా కథంతే ఓ క్షణం పెంచిన గుప్పెడు గుండెకు… పండుగ ఈ వేళా నా కనులు ఎపుడూ కననె కనని పెదవులెపుడూ అననె అనని హృదయమెపుడూ విననె విననీ మాయలో తేలుతున్నా నా మనసు తలుపే… తెరచి తెరచి వెలుగు తెరలే… పరచి పరచి కలలు నిజమై… ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి