రానే వచ్చావా, వానై నా కొరకే వేచే ఉన్నాలే, నీతో తెచ్చావా ఏదో మైమరుపే ఉన్నట్టున్నాలే… నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ… కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వీ దరికే నన్నే చేరితివే వెతికే… ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే… ఎదకే నువ్వు చేరితివే వెతికే… నా చెలివే… ఓ… అడిగే అడిగే ప్రాణం అడిగే తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని పెదవుల మద్యే సరిహద్దే ఇక రద్దే అని ముద్దే అడగకనే అలజడిలా అల్లే మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే కనికట్టే నీ కనులంచునే ఉంచావులే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వీ దరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే… ఎదకే నువ్వు చేరితివే వెతికే… నా చెలివే…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి