29, మార్చి 2023, బుధవారం

Rangamarthanda : Puvvai Virise Pranam Song Lyrics (పూవై విరిసే ప్రాణం)

చిత్రం: రంగమార్తాండ (2023)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఇళయ రాజా

సంగీతం: ఇళయ రాజా





పూవై విరిసే ప్రాణం పండై మురిసే ప్రాయం రెండూ ఒకటే నాణానికి బొమ్మా బొరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే నడకైనా రాని పసి పాదాలే అయినా బతుకంతా నడిచి అలసిన అడుగులే అయినా చెబుతాయా చేరే మజిలీ ఏదో ఒక పాత్ర ముగిసింది నేడు ఇంకెన్ని మిగిలాయో చూడు నడిపేది పైనున్న వాడు నటుడేగా నరుడన్న వాడు తానే తన ప్రేక్షకుడు అవుతాడు ఎవడో ఆ సూత్రధారి? తెలుసా ఓ వేషధారి !! మళ్ళీ మళ్ళీ వందేళ్లు రోజూ సరికొత్తే ఎప్పటికైనా తెలిసేనా బతకడమేంటంటే పూవై విరిసే ప్రాణం పండై మురిసే ప్రాయం రెండూ ఒకటే నాణానికి బొమ్మా బొరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే నడకైనా రాని పసి పాదాలే అయినా బతుకంతా నడిచి అలసిన అడుగులే అయినా చెబుతాయా చేరే మజిలీ ఏదో......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి