17, మార్చి 2023, శుక్రవారం

Vinaro Bhagyamu Vishnu Katha : Darshana Song Lyrics మనసే మనసే తననే కలిసే)

చిత్రం: వినరో భాగ్యము విష్ణు కథ (2023)

సాహిత్యం: భాస్కరభట్ల

గానం: అనురాగ్ కులకర్ణి

సంగీతం: చేతన్ భరద్వాజ్


మనసే మనసే తననే కలిసే అపుడే అపుడే తొలిప్రేమలోన పడిపోయా కదా తనతో నడిచే అడుగే మురిసే తనకా విషయం చెప్పలేక ఆగిపోయా కదా ఎన్నో ఊసులు ఉన్నాయిలే గుండే లోతుల్లో అన్ని పంచేసుకుందామంటే కళ్ళముందు లేదాయే దర్శన దర్శన తన దర్శనానికింకా ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఉండాలిలా తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా ఇష్టమైంది లాగేసుకుంటే చంటిపిల్లాడల్లాడినట్టే దిక్కు తోచకుందే నాకు నువ్వే లేకుంటే నువ్వుగాని నాతో ఉంటే నవ్వులేరుకుంటానంతే నీ జతలో క్షణాలకే దొరికెను పరిమళమే ఆతడు: చక్కగా చెట్టాపట్టా తిరిగాం అట్టా ఇట్టా అరె లెక్కపెట్టుకుంటే బోలెడు ఉన్నాయిలే చెప్పాలంటే ఆతడు: తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా ఆతడు: దారులన్ని మూసేసినట్టే చీకటేసి కప్పేసినట్టే నువ్వు లేకపోతే నేను ఉన్నా లేనట్టే చందమామ రావే రావే జాబిలమ్మ రావే రావే కమ్ముకున్న ఈ మేఘాలలో వెలుతురు కనబడదే ఆతడు: బెంగతో ఇల్లా ఇల్లా పోయేలా ఉన్నానే పిల్ల నువ్వొచ్చేదాకా పచ్చి గంగైనా ముట్టనులే నీమీదొట్టే ఆతడు: తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా తట్టుకోడం కాదే నావల్ల వయ్యారి పిల్ల గుక్కపట్టి ఏడుస్తుందే ప్రాణం నీవల్లా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి