చిత్రం : ఏప్రిల్ 1 విడుదల (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: మనో, చిత్ర
ఒక్కటే ఆశ... అందుకో శ్వాస
అచ్చగా అంకితం చేశా.. పుచ్చుకో ప్రాణేశ
అచ్చగా అంకితం చేశా.. పుచ్చుకో ప్రాణేశ
చుక్కనే చూశా... లెక్కలే వేసా
నింగిపై అంగేలే వేసా.. కిందికే దించేసా
నింగిపై అంగేలే వేసా.. కిందికే దించేసా ఒక్కటే ఆశ... అందుకో శ్వాస మెత్తగా వొళ్లో పెట్టుకో కాళ్ళు ఉందిగా అంకపీఠం... ఆడపుట్టుకే అందుకోసం
గట్టిగ పట్టుకో గట్టిగ హత్తుకో ...పుచ్చుకో పాద తీర్థం
పాద పూజలే ఆధిపాఠం
చాకిరీ చేయన బానిసై .. నీ సేవలే చేయన పాదుషా దీవెనె తీసుకొ బాలిక.. నీ జీవితం సార్థకం పొమ్మిక మొక్కులే తీరి అక్కునే చేరి ...... దక్కెనే సౌభాగ్యం
చుక్కనే చూశా... లెక్కలే వేసా
నింగిపై అంగేలే వేసా.. కిందికే దించేసా
అచ్చగా అంకితం చేశా.. పుచ్చుకో ప్రాణేశ ఒక్కటే ఆశ... అందుకో శ్వాస నచ్చెనే నారి వచ్చెనే కోరి ...తెచ్చెనే ప్రేమ సౌఖ్యం సాటి లేనిది ఇంతి సఖ్యం.. మెచ్చెన్ చేరి ముచ్చటే తీరి ... ఇచ్చెనే ప్రేమ రాజ్యం అంతులేని సంతోషం. స్వప్నమే సత్యమై వచ్చెనేమో ... వెచ్చగా సర్వము పంచగా స్వర్గమే సొంతమై దక్కేనెమో ... అచట ముచ్చట తీర్చగ మక్కువే మీరి ముద్దులే కోరి .. అందేనా ఇంద్ర భోగం ఒక్కటే ఆశ... అందుకో శ్వాస అచ్చగా అంకితం చేశా.. పుచ్చుకో ప్రాణేశ నింగిపై అంగేలే వేసా.. కిందికే దించేసా ఒక్కటే ఆశ... అందుకో శ్వాస
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి