5, నవంబర్ 2023, ఆదివారం

Abbai Gari Pelli : Yenni Yellow Song Lyrics (ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో)

చిత్రం: అబ్బాయిగారి పెళ్లి ( (1997)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: కోటి



ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో మల్లియల్లో తల్లో వానవిల్లో ఎన్నియల్లో ఒళ్లే చెమ్మగిల్లో మల్లియల్లో మంచే తేనెజల్లో ఒళ్లోకొస్తే వయ్యారాలు ఇళ్లోకొస్తే సంసారాలు పగలే తారలు ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో మల్లియల్లో తల్లో వానవిల్లో ఎన్నియల్లో ఒళ్లే చెమ్మగిల్లో మల్లియల్లో మంచే తేనెజల్లో చరణం : 1 నడిచొచ్చే నచ్చే వయసులివి చెలి సొగసులివి దొరికాయి దోరగా కలిసొచ్చే పిచ్చి మనసులివి కసి వరసలివి కలిసాయి కమ్మగా మొగుడికి నచ్చు కన్నె మొగ్గల్లే గిచ్చు తలగడ మంత్రం తాళి కట్టాక చదవచ్చు ప్రేమించుకుంటే వేళాపాళా లేనే లేవులే... లేనే లేవులే ఎన్నియల్లో ఒళ్లే చెమ్మగిల్లో మల్లియల్లో మంచే తేనెజల్లో ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో మల్లియల్లో తల్లో వానవిల్లో చరణం : 2 చిటికేస్తే కాసే కనులు ఇవి ప్రియ కలలు ఇవి నడిరేయే నవ్వగా తడిచేసే తేనె పెదవులివి రసపదవులివి తుడిచేస్తా ముద్దుగా పలకని మాట పదహారు వన్నెల పాట పరువపు బాట కులుకుల కులాస తోట పెళ్లాడుకుంటే లైలా మజ్ను గాథే లేదులే... గాథే లేదులే ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో మల్లియల్లో తల్లో వానవిల్లో ఎన్నియల్లో ఒళ్లే చెమ్మగిల్లో మల్లియల్లో మంచే తేనెజల్లో ఒళ్లోకొస్తే వయ్యారాలు ఇళ్లోకొస్తే సంసారాలు పగలే తారలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి