24, డిసెంబర్ 2023, ఆదివారం

Bharata Simha Reddy : Malli Malli Song Lyrics (మళ్ళీ మళ్ళీ వచ్చే పున్నమిలా)

చిత్రం: భరతసింహా రెడ్డి (2002)

రచన: చంద్రబోస్

గానం: రాజేష్ , కవిత కృష్ణమూర్తి

సంగీతం: ఎస్. ఎ.రాజ్ కుమార్



మళ్ళీ మళ్ళీ వచ్చే పున్నమిలా నువ్వు నవ్వుతుంటే చాలు అలా వెండి కొండ మీద చంద్రుడిలా తొంగి తొంగి నన్ను చూడకలా మనసారా రమ్మని నన్ను పిలిచే స్వర్గమా వరమిచ్చే దేవుడే వరుడయే భాగ్యమా ఇది నిజమా నేస్తమా నువ్వే నా సొంతమా ఎదచెరే తీరమా ఇంకా ఈ దూరమా మళ్ళీ మళ్ళీ వచ్చే పున్నమిలా నువ్వు నవ్వుతుంటే చాలు అలా కథలేన్నో చెప్పాలని ఎగిసి పడే నా ఆశలు నిన్ను చేరే ఘడియ కోసం ఎదురు చూస్తున్నవి కలలు కనే నా కళ్ళతో కలబడుతు నీ చూపులు విరహమంటే ఏమిటంటు తేలుసుకోమన్నవి ప్రేమించే గుండెల సవ్వడి సిరి మువ్వల అడుగుల సందడి ఎదలో మొదలై అలికిడి వినమంటు ఒకటే అల్లరి చెవులుండే మనసుకి అది కాదా బహుమతి హ. మళ్ళీ మళ్ళీ వచ్చే పున్నమిలా నువ్వు నవ్వుతుంటే చాలు అలా ప్రతి నిమిషం నీ ఊహలే ఊపిరిగా ఉన్న సరే నిన్ను చూస్తే మాటరాదు ఎందుకే నా చెలి ఒంటరిగా ఉన్నానని మనసు పడే నీ మటలే తలుచుకొంటే సిగ్గుముంచే ఏమిటి ఈ ధోరణి ఎన్నెన్నో జన్మలు వేచినా ఇప్పుడే నీ సన్నిధి చేరినా నీ కౌగిలిలోనే ఒదిగిన నా ఏదో ఆవేదనా చిగురించే ప్రేమకి అది నీలో స్పందన మళ్ళీ మళ్ళీ వచ్చే పున్నమిలా నువ్వు నవ్వుతుంటే చాలు అలా వెండి కొండ మీద చంద్రుడిలా తొంగి తొంగి నన్ను చూడకలా మనసారా రమ్మని నన్ను పిలిచే స్వర్గమా వరమిచ్చే దేవుడే వరుడయే భాగ్యమా ఇది నిజమా నేస్తమా నువ్వే నా సొంతమా ఎదచెరే తీరమా ఇంకా ఈ దూరమా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి