చిత్రం: వెలుగు నీడలు(1999)
సాహిత్యం: మల్లెమాల
సంగీతం: ఎం. ఎం.శ్రీలేఖ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పల్లవి:
ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు నా పాలిటి మాధవుడు ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు నా పాలిటి మాధవుడు లేడని ఎందరు నమ్మపలికినా లేశమైన నే నిరాశ చెందక లేడని ఎందరు నమ్మపలికినా లేశమైన నే నిరాశ చెందక ఎదురు తెన్నులు చూసిన ఫలితం ఎదురుగా వరమై నిలిచిందమ్మా ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు నా పాలిటి మాధవుడు చరణం:1 కరగిపోయిన గతం సర్వం మరిచిపోదాము చెరగని ప్రేమకు మెరుగులు తరగని శీర్షికలౌదాము కరగిపోయిన గతం సర్వం మరిచిపోదాము చెరగని ప్రేమకు మెరుగులు తరగని శీర్షికలౌదాము నింగి నేల సాక్షిగా నిర్మల ప్రేమే దీక్షగా ఒకరు పాదమై ఒకరు నాదమై కమ్మని పాటకు శృతిలయలౌదాము కాలం పరుగుకు కళ్లెం వేద్దాము..... ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు నా పాలిటి మాధవుడు చరణం:2 ఆగిపోయిన పెళ్లికి మళ్ళీ ఆయువు పోద్దాము ఆగక పొంగే ఆశలన్నిటికి హారతి పడదాము ఆగిపోయిన పెళ్లికి మళ్ళీ ఆయువు పోద్దాము ఆగక పొంగే ఆశలన్నిటికి హారతి పడదాము ముద్దుముచ్చట తోడుగా ఇద్దరమూ సరిజోడుగా ఒకరు సత్యమై ఒకరు నిత్యమై బంగరు భవితకు బాటలు వేద్దాము బృందావనికే గంధం పూద్దాము ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడు నా పాలిటి మాధవుడు లేడని ఎందరు నమ్మపలికినా లేశమైన నే నిరాశ చెందక లేడని ఎందరు నమ్మపలికినా లేశమైన నే నిరాశ చెందక ఎదురు తెన్నులు చూసిన ఫలితం ఎదురుగా వరమై నిలిచిందమ్మా ఎన్నాళ్ళకు వచ్చాడమ్మా వంశీ మోహనుడునా పాలిటి మాధవుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి