26, డిసెంబర్ 2023, మంగళవారం

Bullet (1985) : Maa telugu talliki Song Lyrics (మా తెలుగు తల్లికి మల్లెపూదండ)

చిత్రం: బుల్లెట్ (1985)

సాహిత్యం: వేటూరి సుందర రామ మూర్తి

సంగీతం: కె.వి.మహదేవం

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగలా గోదారి కదలిపోతుంటేను బిరాబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరులుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు మంగళారతులు..... అమరావతీ గుహల అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి