చిత్రం: పరువు ప్రతిష్ఠ (1999)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: రాజ్ - కోటి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
ఇది ఎవరాడించే ఆట.. ఆ విధి చేతిలోని సయ్యాట పరువు ప్రతిష్ట కోసం జరుగుతున్న చెలగాటం పరువు ప్రతిష్ట కోసం కఠిక గుండెను చీల్చుకొని కన్నీరు పొంగి పొరలిందా అహంభావమడుగంటి తీయని ఆత్మీయత మొలకెత్తిందా మట్టిలోన ఒలికిన పాలు మట్టిలోన ఒలికిన పాలు మళ్లీ చేతికి రావమ్మా కాటిలోన కలిసిన దేహం గూటికి తిరిగి రాదమ్మా గూటికి తిరిగి రాదమ్మా పరువు ప్రతిష్ట కోసం జరుగుతున్న చెలగాటం పరువు ప్రతిష్ట కోసం ఏ బంధాన్ని తెంచేసిందో ఏ ప్రాణాన్ని బలి చేసిందో మనిషివైతే తెలుసుకో మనసునే సరిదిద్దుకో వల్లకాడు నిన్ను ఈడ్చుకుపోతే వల్లకాడు నిన్ను ఈడ్చుకుపోతే వంశగౌరవం ఆపదు మనిషి చచ్చినా నలుగురు మెచ్చే మంచితనం చావదు మంచితనం చావదు పరువు ప్రతిష్ట కోసం జరుగుతున్న చెలగాటం పరువు ప్రతిష్ట కోసం.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి