చిత్రం: కలసి నడుద్దాం (2001)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: ఎస్. ఎ.రాజ్ కుమార్
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పల్లవి: అటు ఇటు చూడకే దోర వయసా..... ఎటు ఎటు ఉన్నదో దారి తెలుసా..... ఏది ఇలా రా నిషా లాలసా..... ఏదో అయ్యేలా వలేసే నసా..... బెదురసలెందుకే అందుకో భరోసా..... నీ మనసే కదా నా బస ప్రాణేశా..... అటు ఇటు చూడకే దోర వయసా..... ఎటు ఎటు ఉన్నదో దారి తెలుసా..... చరణం:1 కాస్త కొత్తగా ఇంకాస్త మత్తుగా తమాషాగా తూగింది నీ ఆశ కొంత కొంటెగా రవ్వంత మంటగా విలాసాగా తాకింది నీ శ్వాస జతలో తగాదాలు పెదవులు పెనవేయగా ఎదలో రహస్యాలు నిదరను వదిలేయగా గుసగుస భాషలు ఊసులు వినేశా అలజడి చూపులో కోరిక చెప్పేశా అటు ఇటు చూడకే దోర వయసా..... ఎటు ఎటు ఉన్నదో దారి తెలుసా..... చరణం:2 మోయలేనిక సహాయమందక వయ్యారాల భారాల ఈ ప్రాయం చేరుకుందిగా సుఖాల లేఖగా నిగారాల గారాల సందేశం ఇదిగో ఇదే దారి అరమరికలు దాటగా ఒడిలో నువ్వే చేరి అణువణువును మీటగా తపనల ఆపద తీరగా వచ్చేశా తళతళ సంపద చల్లగా దోచేశా అటు ఇటు చూడకే దోర వయసా..... ఎటు ఎటు ఉన్నదో దారి తెలుసా..... ఏది ఇలా రా నిషా లాలసా..... ఏదో అయ్యేలా వలేసే నసా..... బెదురసలెందుకే అందుకో భరోసా..... నీ మనసే కదా నా బస ప్రాణేశా....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి