చిత్రం: కలసి నడుద్దాం (2001)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: ఎస్. ఎ.రాజ్ కుమార్
గానం: హరిహరన్, సుజాత
ఒకసారి కిందికి రా చుక్కలలో చంద్రుడా
హాయి మంట తీసుకురా రేయి సూర్యుడా
చల్లబారి పోయిన ఈ కౌగిలిలో కొత్తగా
మళ్లీ వెలిగింతువురా వేడి వెన్నెల
ఎప్పుడో మరిచి పోయా జతలో ముచ్చటా
గురుతే చేసిపోర వెళ్ళగా
ఒకసారి కిందికి రా చుక్కలలో చంద్రుడా హాయి మంట తీసుకురా రేయి సూర్యుడా
ఓ... నీలి మబ్బు నీడలా నిద్దరోకు మత్తుగా
వేడిగా వేడుకగా వేంట తరమదా
ఒ... పిల్ల గాలి మీదుగా చేరుకోవ చల్లగా
త్వరగా తుంటరిగాతొంగి చూడదా
కిటికీలు తెరిచి ఉన్న ఇటు రావే చొరవగా
అనువైన చీకటున్న ఏం సరదా పడ్డవుగా
ఇది ఏం నాటి జంటోవనా ఒకసారి కిందికి రా చుక్కలలో చంద్రుడా హాయి మంట తీసుకురా రేయి సూర్యుడా
ఓ... సొంతమైన సొంపులో ఇన్నీ వింత రంగులా
ఎప్పుడు చూడనిది మేరుపు తలతలా
ఓ... చుట్టుకున్న చూపులో ఎన్ని సూది చురుకులా
సిగ్గులే సిగ్గుపడి నిలవనంతలా
తొలి వెచ్చనైన శ్వాస తనువంతా తిరగని
నిన్ను మెచ్చుకున్న ఆశ అనువనువు కరగని
విరహం బెదిరిపోయంతలా...
ఒకసారి కిందికి రా చుక్కలలో చంద్రుడా హాయి మంట తీసుకురా రేయి సూర్యుడా
చల్లబారి పోయిన ఈ కౌగిలిలో కొత్తగా
మళ్లీ వెలిగింతువురా వేడి వెన్నెల
ఎప్పుడో మరిచి పోయా జతలో ముచ్చటా
గురుతే చేసిపోర వెళ్ళగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి