చిత్రం: కళ్ళు (1988)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
గానం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
తెల్లారింది లెగండో... కొక్కొరోక్కో మంచాలింక దిగండో... కొక్కొరోక్కో పాము లాంటి సీకటి పడగదించి పోయింది భయం లేదు భయం లేదు నిదర ముసుగు తీయండి సావు లాంటి రాతిరి సూరుదాటి పోయింది భయం లేదు భయం లేదు సాపలు సుట్టేయండి ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట సెట్టు ఇడిసింది (2) మూసుకున్న రెప్పలిరిసి సూపులెగరనీయండి
తెల్లారింది లెగండో... కొక్కొరోక్కో మంచాలింక దిగండో... కొక్కొరోక్కో సురుకు తగ్గిపోయింది సందురుడి కంటికి సులకనైపోయింది లోకం సీకటికి కునుకు వచ్చి తూగింది సల్లబడ్డ దీపం యెనక రెచ్చిపోయింది అల్లుకున్న పాపం మసకబారిపోయిందా సూసే కన్ను ముసురుకోదా మైకం మన్ను మిన్ను కాలం గట్టిన గంతలుదీసి కాంతుల ఎల్లువ గంతులు యేసి.
తెల్లారింది లెగండో... కొక్కొరోక్కో మంచాలింక దిగండో... కొక్కొరోక్కో ఎక్కిరించు రేయిని సూసి యెర్రబడ్డ ఆకాసం ఎక్కుబెట్టి ఇసిరిందా సూరీడి సూపుల బాణం కాలి బూడిదైపోదా కమ్ముకున్న నీడ ఊపిరితో నిలబడుతుందా సిక్కని పాపాల సీడ సెమట బొట్టు సమురుగా సూరీన్ని యెలిగిద్దాం యెలుగు సెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం యేకువ శక్తుల కత్తులు దూసి రేతిరి మత్తును ముక్కలు సేసి తెల్లారింది లెగండో... కొక్కొరోక్కో మంచాలింక దిగండో... కొక్కొరోక్కో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి