చిత్రం: శుభవార్త (1998)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: కోటి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
జాబిలమ్మా ఆగవమ్మా అలకించవా ఈ శుభవార్త జంట ప్రేమ చాటేనమ్మా వేలవన్నెలా ఈశుభవార్త కలి తీయగా ఫలించేనని వరాలే ఇలా వరించేనని ఈ కనివిని వెరుగని కళ్యాణం అపురూపం అని కలే తీయగా ఫలించేనని వరాలే ఇలా వరించేనని జాబిలమ్మా ఆగవమ్మా అలకించవా ఈ శుభవార్త జంట ప్రేమ చాటేనమ్మా వేలవన్నెలా ఈ శుభవార్త కలే తీయగా ఫలించేనని వరాలే ఇలా వరించేనని ప్రతి మదనులు తొలి అతిధులుగా కదిలొచ్చే కాలమనిీ శృతి ముదిరిన తహతహలన్ని ఆహ్వానం పాడని మన కలయిక కలలకు కలగా అనిపించే సమయమని మునుపెరగక ప్రతి నిమిషాన్ని కౌగిల్లోసాగనీ చెరో సగమయే సరాగాలతో ఒకే ప్రాణమై ఉందాం రమ్మని ఎడబాటే లేని ఏకాంతంనే అందించని జాబిలమ్మా ఆగవమ్మా అలకించవా ఈ శుభవార్త జంట ప్రేమ చాటేనమ్మా వేలవన్నెలా ఈ శుభవార్త కలే తీయగా ఫలించేనని హో..వరాలీయిగా వరించేనని కలతెరుగని తలపుల హృదయం సరిపోని కోయిలని అలు పెరుగని వలపుల దీపం మన ఎదలో చేరని ఏ రుతువున చెదరని స్నేహం మన బ్రతుకున ఉన్నదని మన పెదవుల నిలిచిన ఛైత్రం చిరు నవ్వులు పూయని సదా ఈ జతా ఇదే తీరుగా ప్రతి ఊహని నిజం చేయగా ఈ తియ్యని చెలిమే తీరని రుణమై దీవించని జాబిలమ్మా ఆగవమ్మా అలకించవా ఈ శుభవార్త జంట ప్రేమ చాటేనమ్మా వేలవన్నెలా ఈ శుభవార్త కలే తీయగా ఫలించేనని వరాలే ఇలా వరించేనని ఈ కనివిని యెరుగని కళ్యాణం అపురూపం అని కలే తీయగా ఫలించేనని వరాలీయిగా వరించేనని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి