30, డిసెంబర్ 2023, శనివారం

Kondapalli Raja : Kondapalli Raja Song Lyrics (కొండపల్లి రాజా గుండె చూడరా)

చిత్రం: కొండపల్లి రాజా (1993)

సాహిత్యం: భువనచంద్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


కొండపల్లి రాజా గుండె చూడరా బసవన్న ఓ బసవన్నా గుండెలోన పొంగే ప్రేమ నీదిరా వినరన్నా ఓ బసవన్నా పశువంటె మనిషికి అలుసు మనసున్న నీకది తెలుసు అ ఆ ఇ ఈ రానె రాదు అయినా మాయా మర్మం లేదు కొండపల్లి రాజా గుండె చూడరా బసవన్న ఓ బసవన్నా గుండెలోన పొంగే ప్రేమ నీదిరా వినరన్నా ఓ బసవన్నా కన్నతల్లిలా పాలనిచ్చి ప్రాణం పోసే త్యాగం ఉన్న గొప్ప జాతి నీది సొమ్ము చూపిస్తే గొంతు కోసి రంకెలేసే జాలిలేని పాడు లోకం మాది తెలుసా బసవన్న నీకైనా యెందుకు ఇంతటి భేదం క్షణమే బతుకన్న ఓ బసవన్న మనిషికి లేదురా పాశం కాటికెళ్ళినా కాసు వీడడు సాటివాడిపై జాలి చూపడు డబ్బును మేసే మనుషులు కన్న గడ్డిని మేసే నువ్వె మిన్న కొండపల్లి రాజా గుండె చూడరా బసవన్న ఓ బసవన్నా గుండెలోన పొంగే ప్రేమ నీదిరా వినరన్నా ఓ బసవన్నా మబ్బు డొంకల్లో దూసుకెళ్ళే పక్షిని చూసి కూర్చినాడు మనిషి విమానం వాగు వంకల్లో ఈదుకెళ్ళే చేపని చూసి నేర్చినాడు పడవ ప్రయాణం దివికి భువికి ముచ్చటగా నిచ్చెన వేసిన మనిషి చెలిమి కలిమి నలుగురికి ఎందుకు పంచడు తెలిసీ తరిగి పోనిది ప్రేమ ఒక్కటే తిరిగి రానిది ప్రాణమొక్కటే ప్రాణం కన్నా స్నేహం మిన్న స్నేహం లేని బతుకే సున్నా కొండపల్లి రాజా గుండె చూడరా బసవన్న ఓ బసవన్నా గుండెలోన పొంగే ప్రేమ నీదిరా వినరన్నా ఓ బసవన్నా పశువంటె మనిషికి అలుసు మనసున్న నీకది తెలుసు అ ఆ ఇ ఈ రానె రాదు అయినా మాయా మర్మం లేదు కొండపల్లి రాజా గుండె చూడరా బసవన్న ఓ బసవన్నా గుండెలోన పొంగే ప్రేమ నీదిరా వినరన్నా ఓ బసవన్నా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి