చిత్రం: మా బాపు బొమ్మకు పెళ్లంట (2003)
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
సంగీతం: కోటి
గానం: ఉష
పల్లవి: మాటలే రాని వేళ పాట ఎలా పాడను కంటిలో కడిలిని ఇక ఎంత సేపు ఆపనూ ఓటమే వెంట ఉంటె అడుగు ఎలా కదపను కాలమే కాటు వేస్తె ప్రాణమెలా నిలుచును మట్టిలో కలిసే దేహమే ఇది లేని పోని ఆశలు రేపెనా విధీ పూజతో శాపం దక్కిందా గుండెలో గాయం మిగిలిందా చరణం:1 చిన్ననాటి నుండి నాకు తోడు ఒక్కటే నీడలాగ వెంట ఉంది కష్టమొక్కటే (2) ఏడుపంటే కొత్తేమి కాదు బాధ నాకు వింతేమి కాదు ఇప్పుడున్న గుండెకోత ముందు ఎరుగను చెప్పుకుంటే తగ్గేది కాదు పంచుకునే తోడంటు లేదు అంతులేని దారిలోన ఎంత నడవను ఇది నాలో దోషమా పై దేవుడి శాపమా విధి ఆడే జూదమా మనసంటే మాయేనా
మాటలే రాణి వేల పాట యేల పాడను కాంతిలో కదలిని ఇక ఎంతసేపు ఆపను...... చరణం:2 నాకు బాధ కలిగినపుడు నువ్వు లాలనా బొమ్మలాగ నువ్వు ఉంటే దిక్కు తోచునా (2) చల్లనైన నీ గుండె పైనా మాలలాగ నేనుండిపోయే భాగ్యమింక జన్మలోన నాకులేదులే జన్మ అంటు ఇంకోటి ఉంటే పువ్వునై నీ చెంత చేరి నన్ను కడతేరనివ్వు పాద పూజలో నా ప్రాణం నీవేరా…..నా ధ్యానం నీవేరా….. క్రిష్ణా..... క్రిష్ణా.....క్రిష్ణా......క్రిష్ణా.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి