30, డిసెంబర్ 2023, శనివారం

Maavidakulu : Ammante Thelusuko Song Lyrics (అమ్మంటే తెలుసుకో..)

చిత్రం: మావిడాకులు (1998)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: కోటి




పల్లవి: అమ్మంటే తెలుసుకో...జన్మంతా కొలుచుకో... ఇలలో వెలసిన ఆ బ్రహ్మ పేరు అమ్మ... అమ్మంటే తెలుసుకో...జన్మంతా కొలుచుకో... ఓ..ఓ..అనుబంధానికీ..ఓ..ఓ..అనురాగానికీ... తొలి తొలి రూపం అమ్మంటే.. నాన్నంటే తోడురా..నీవెంటే నీడరా... చరణం:1 అమ్మైన స్త్రీ జన్మ అరుదైన పుణ్యం రొమ్ముల్లో నింపింది ప్రేమామృతం పేగు చీలి ముడతపడిన పొత్తి కడుపు చర్మం స్త్రీ జాతి త్యాగాలు రాసున్న గ్రంథం మమతెరిగిన మాతృత్వం తరగని అందం అది తెలియని సౌందర్యం దొరకని స్వప్నం అతి మధురం తల్లి తండ్రి అయ్యే క్షణం అమ్మంటే తెలుసుకో... జన్మంతా కొలుచుకో.. చరణం:2 పుట్టించగలిగేది మగజన్మ అయినా ప్రతివారు కాలేరు నిజమైన నాన్న కన్నతండ్రి అన్న పదవి జంతువులకు ఏదీ? ఆ జ్ఞానముంటేనే అసలైన తండ్రి ఇదిగిదిగో ఈ బిడ్డను కన్నది వీరే... అని నలుగురు తననెంతో పొగుడుతు ఉంటే తండ్రి అవడం అంటే అర్థం అదే కదా నాన్నంటే తోడురా.. నీవెంటే నీడరా.. నిను పాలించే మహారాజు పేరు నాన్న అమ్మంటే తెలుసుకో...జన్మంతా కొలుచుకో...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి