25, డిసెంబర్ 2023, సోమవారం

Moratodu Naa Mogudu : Koyilala Aa Kammati Song Lyrics (కొయిలాల ఓ..కమ్మటి కబురిన వేల)

చిత్రం: మొరటోడు నా మొగుడు (1994)

సాహిత్యం: సి.నారాయణరెడ్డి

గానం: స్వర్ణలత

సంగీతం: ఇళయరాజా




కొయిలాల ఓ..కమ్మటి కబురిన వేల సల్లటేల ఆ సంగతి చెవినేయాల ఆలకిస్తే నమ్మ వేమొనే.. అమ్మ తోడు కల్ల కాదులే గుండేలో నిండే ఇంత సంతోషం ఉండలేనందే ఇనిపో... కొంచెం. కొయిలాల ఓ..కమ్మటి కబురిన వేల సల్లటేల ఆ సంగతి చెవినేయాల ఉడుకు నీళ్ళు కాచాను ... సలవ పంచ తీశాను ఎప్పుడొచ్చి తాన మాడునో.. ఓ.హో.. ఇష్టమైన కూరోండి ఏడి మీద ఉంచాను ఎప్పుడొచ్చి ఆరగించునో. ఓ..హో. ఈపు రుద్ద మంటాడొ ఏమిటో పాడు సిగ్గు ఆడి మాట ఆలకిస్తదా.. గోరు ముద్ద లంటాడొ ఏమిటో కంటి రెప్ప ఆడి వైపు చూడనిస్తదా.. ఇట్టా ఎల్లకాలం ఆడి జతగా బతకనా.... వచ్చే యాల కోసం వీధి గడపై చూడనా జతగా బతకనా ....గడపై చూడనా.... కొయిలాల ఓ..కమ్మటి కబురిన వేల సల్లటేల ఆ సంగతి చెవినేయాల మాటలోని పెళుసంట మనసు యన్న పూసంట మావ అచ్ఛు రాములెరకే .. ఓ...హో... దేవుడల్లె ఆడొస్తే దెయ్యమేమో అన్నట్టు దడుచుకోని దూరమైతినే.. ఓ..హో... ఎంత కష్ట పెట్టాని మామని ఎన్ని జనమలెత్తి రుణము తీర్చుకుందునే కడుపులోన ఉన్న ఆడి పేమని కాళ్ళ సేత అంత కంత తన్నమందునే యాడో మిగిలి ఉన్నా కాస్త పుణ్యం పండెనే... ఎంతో ఒదులుకున్నా ఇంత భాగ్యం అందెనే... పుణ్యం పండెనే... భాగ్యం అందెనే... కొయిలాల ఓ..కమ్మటి కబురిన వేల సల్లటేల ఆ సంగతి చెవినేయాల ఆలకిస్తే నమ్మ వేమొనే.. అమ్మ తోడు కల్ల కాదులే గుండేలో నిండే ఇంత సంతోషం ఉండలేనందే ఇనిపో... కొంచెం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి